Homeక్రీడలునా పునరాగమనాన్ని అడ్డుకుంటున్నారు

నా పునరాగమనాన్ని అడ్డుకుంటున్నారు

- Advertisement -

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విస్మయం
న్యూదిల్లీ: రెజ్లింగ్‌లోకి తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. ఆసియా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ట్రయల్స్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను నేషనల్ ఓపెన్ ర్యాకింగ్ టోర్నమెంట్‌లో రెజ్లింగ్‌లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ తుదిగడువు ఏప్రిల్ 30న ముగుస్తుండగా… రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే… గడువు ముగిసిందని సందేశం వస్తోందని తెలిపారు. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫఐ) లోని పాలనా యంత్రాంగాన్ని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదని తెలిపింది. ఫెడరేషన్ కప్‌లోను పాల్గొందామనుకుంటే అక్కడా చివరి నిమిషంలో ఎంపిక ప్రమాణాలు మార్చారని, దాంతో నేను ఆడలేకపోయానని ఫొగాట్ ఆరోపించింది. తనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపింది. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్ షిప్ సెలక్షన్ ట్రయల్స్‌లో పోటీలో ఉండాలంటే ఈ టోర్నమెంట్ ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ ఆరోపణలను డబ్ల్యూఎఫఐ అధ్యక్షుడు సంజయ్‌సింగ్ తోసిపుచ్చారు. చాలామంది రెజ్లర్లకు రిజిస్ట్రేషన్ విషయంలో సమస్యలు తలెత్తాయని వెల్లడించారు. తమ సిబ్బందిని సంప్రదించి, సమస్యను పరిష్కరించుకున్నారని తెలిపారు. పోటీపడకుండా మేం ఎవరినీ అడ్డుకోబోమని పేర్కొన్నారు.
అండర్-17 మహిళా రెజ్లర్‌పై వేటు
మహారాష్ట్రలో జరుగుతున్న జాతీయ చాంపియన్‌షిప్ పోటీల నుంచి డబ్ల్యూఎఫఐ తొలగించింది. ఆమె తండ్రి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రెండు జనన ధృవీకరణ పత్రాలను సమర్పించడంతో.. అండర్-17 రెజ్లర్‌ను పోటీలో పాల్గొనకుండా అడ్డుకుంది. మధ్యప్రదేశ్ తరపున మహిళల 57 కేజీల విభాగంలో పాల్గొంటున్న రెజ్లర్ జనన రికార్డులలో వ్యత్యాసాల ను గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు