ఐరాస సంస్కరణలపై గుటెర్రస్ హెచ్చరిక
ఐరాస: ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలకు సంబంధించి ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు ముందుండాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ సూచించారు. నేడు ప్రయోజనాలు, లాభాలంటూ ఊగిసలాడితే రేపు మూల్యం చెల్లించుకోక తప్పబోదని హెచ్చరించారు. ‘నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించే వ్యవస్థలకు సంస్కరణలు సంబంధించి ఉండాలి. 1945 నాటి సమస్యల పరిష్కార విధానంతో 2026 నాటి సమస్యలను పరిష్కరించలేము. వ్యవస్థలు వర్తమాన పరిస్థితులు, నేటి ప్రపంచం, వాస్తవికలకు అనుగుణంగా లేకపోతే అవి వాటి చట్టబద్ధతను కోల్పోతాయి’ అని గుటెర్రస్ అన్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవస్థలు ఉండాలని, అందుకోసమే అంతర్జాతీయ ఆర్థిక`వాణిజ్య వ్యవస్థల్లో సంస్కరణలు ప్రధానమని, భద్రతా మండలికి ఇదే వర్తిస్తుందని ఆయన అన్నారు. మార్పును స్వీకరించగల ధైర్యం ఉండాలని సూచించారు. ‘ప్రపంచం ఎవరి కోసం ఎదురు చూడదు. మనం కూడా నిరీక్షించరాదు. పరివర్తనాన్ని స్వాగతించాలి’ అని గుటెర్రస్ అన్నారు.
నేడు లాభం కోరితే…రేపు మూల్యం తప్పదు
- Advertisement -
RELATED ARTICLES


