. పిట్టల్లా రాలిపోతున్న జనం
. 30 వరకు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం
. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సోమవారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు తోడు వడగాడ్పులు వీస్తుండడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరుల్లో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా… దాదాపు 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణో> ·త్రలు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రం నిప్ప్పుల కుంపటిలా మారింది. పగలు uయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ముఖ్యంగా భానుడి ఉగ్ర రూపానికి వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడిపోతున్నారు. మరోపక్క అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత వారం రోజుల్లో వడగాడ్పులు, ఎండ తీవ్రతకు తట్టుకోలేక దాదాపు 80 మంది మృత్యువాత పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సోమ వారం ఒక్కరోజే వడదెబ్బకు రాష్ట్రంలోని వివిధ ప్రరాంతాల్లో 17 మంది చనిపో యారు. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున… ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకు వెళ్లాలని సూచిం చారు. కంకిపాడు, పెనమలూరు తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన వాటిలో బాపట్ల(జి) కూచినపూడిలో 46.4 డిగ్రీలు, ఎన్టీఆర్(జి) ఇబ్రహీంపట్నం, పల్నాడు(జి) పిడుగురాళ్లలో 46.3 డిగ్రీలు, ఏలూరు(జి) కుక్కునూరు, పోలవరం(జి) కూనవరంలో 46.1, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 45.7, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 45.4, కోనసీమ(జి) శివల, కాకినాడ(జి) కాజులూరులో 45.2, గుంటూరు(జి) మంగళగిరిలో 44.9, మార్కాపురం(జి) నందనమారెళ్లలో 44.7, విశాఖ(జి) ములగాడలో 44.4, తూర్పుగోదావరి(జి) పోతవరంలో 44.3 డిగ్రీలు నమోద య్యాయి. ద్రోణి ప్రభావంతో మంగళవారం పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడొద్దని సూచించారు.


