Homeక్రీడలుముంబై ఇండియన్స్‌కు షాక్

ముంబై ఇండియన్స్‌కు షాక్

- Advertisement -

మరో రెండు మ్యాచ్‌లకు రోహిత్ దూరం
ముంబై: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస సవాళ్లను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ…గాయం కారణంగా రాబోయే కనీసం మరో రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల సమాచా రం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ శర్మ గాయపడటమే దీనికి ప్రధాన కారణం.ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో ఆయన ‘రిటైర్డ్ హర్ట’గా వెనుదిరగాల్సి వచ్చింది. స్కానింగ్ నివేదికల ప్రకారం.. రోహిత్ కండరాలకు విశ్రాంతి అవసరమని, లేనిపక్షంలో గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్య బృందం హెచ్చరించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మేనేజ్‌మెంట్ ఆయనకు రెండు మ్యాచ్‌ల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ అనుభవం అత్యంత కీలకం. ఓపెనర్‌గా రోహిత్ ఇచ్చే శుభారంభం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు రోహిత్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి. కాగా ఐపీఎల్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో రోహిత్ గాయం టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌ను కూడా కలవరపెడుతోంది. బీసీసీఐ వైద్య బృందం కూడా ముంబై ఫిజియోలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రోహిత్ శర్మ త్వరగా కోలుకుని జట్టులోకి రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు