Homeవిశ్లేషణరక్షణలేని జీవితం!

రక్షణలేని జీవితం!

- Advertisement -

ఇటీవల ఒక జిల్లా ఉన్నతాధికారి ఒక విలేకరికి ఫోన్‌చేసి, దుర్భాషలాడారు. చంపేస్తానని బెదిరించారు. ఆ విలేకరికి చెందిన పిల్లల అంతుచూస్తానని కూడా హెచ్చరించారు. కాకపోతే, ఆ ఫోన్‌కాల్‌ను విలేకరి తెలివిగా రికార్డుచేసి, పోలీసులకు సమర్పించారు. ఆ తర్వాత అది సోషల్‌మీడియాలో హల్‌చల్‌ అయింది. ఆ విలేకరిపై బీపన్‌పస్‌లోని 132, 351(2) రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద కేసుపెట్టారు. ఇండియన్‌ జర్నలిస్ట్సు jూనియన్‌ (ఐజేjూ) అనుబంధ ఏపీjూడబ్ల్యుజే ఈ కేసులో విలేకరికి అండగా నిలబడి, పోరాటం చేస్తున్నది. jూనియన్‌ను అభినందించాల్సిందే.
చిత్తూరు కేసు పాత్రికేయ హక్కుల హననానికి ఓ నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లోనేకాదు, దేశవ్యాప్తంగా జర్నలిస్టులు స్వేచ్ఛగా బతికే పరిస్థితి కన్పించడంలేదు. పాత్రికేయులే లక్ష్యంగా దాడులు, చర్యలు పెరిగిపోయాయని పన్నో నివేదికలు చెపుతున్నాయి. రైట్స్‌ అండ్‌ రిస్క్స్‌ పనాలిసిస్‌ గ్రూప్‌ (ఆర్‌ఆర్‌ఏజీ) నివేదిక 2022 ప్రకారం, 2022లో దేశవ్యాప్తంగా 194 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని, దాడులు చేయడం లేదా అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఇందులో ఏడుగురు మహిళా జర్నలిస్టులు ఉండటం గమనార్హం. వీరిలో 103 మందిని ప్రభుత్వేతర సంస్థలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకోగా, 91 మందిని పోలీసులు, రాష్ట్ర సంస్థలు టార్గెట్‌ చేశాయి. వారిలో 70 మంది జర్నలిస్టులను అరెస్టు చేయడం, లేదా నిర్బంధించడం, 14 మందిపై పఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జర్నలిస్టులను అత్యధికంగా లక్ష్యంగా చేసుకున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జవ్మూకశ్మీర్‌ (48), తెలంగాణ (40), ఒడిశా (14) ఉన్నాయి. 2022లో కనీసం పనిమిది మంది జర్నలిస్టులు హత్యకు గురికావడం అత్యంత బాధాకరమైన విషయం. ఠాకూర్‌ ఫౌండేషన్‌ అధ్యయనం ప్రకారం, 2014 నుంచి 2019 మధ్యకాలంలో జర్నలిస్టులపై 198 తీవ్రమైన దాడులు నమోదయ్యాయి. ఈ కాలంలో 40 మంది జర్నలిస్టులు మరణించారు. వీరిలో 21 మంది హత్యలు కేవలం వారి వృత్తిపరమైన పనికి సంబంధించినవిగా నిర్ధారించారు. దర్యాప్తు విషయానికొస్తే, జర్నలిస్టులు దాడికి గురైన 63 కేసులలో కేవలం 25 కేసులలోనే పఫ్‌ఐఆర్‌ నమోదయింది. కాకపోతే, శిక్షల రేటు దాదాపు సున్నాగా ఉంది. కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే) నివేదికల ప్రకారం జర్నలిస్టుల హత్య కేసులను పరిష్కరించడంలో వైఫల్యం చెందిన దేశాల జాబితాలో (గ్లోబల్‌ ఇంప్యూనిటీ ఇండెక్స్‌) భారత్‌ పేరు కూడా ఉంది. 1992 నుంచి భారతదేశంలో 75 మంది జర్నలిస్టులు (మీడియా కార్మికులు, ఉద్యోగులు) హత్యకు గురయ్యారు. వీరిలో 44 హత్యలకు ఆయా జర్నలిస్టులు రాసిన ప్రత్యేక కథనాలే కారణం. అంటే, వారు నీతి, నిజాయితీగా పనిచేయడమే హత్యలకు కారణంగా గుర్తించారు. చాలా కేసులలో నేరస్థులకు శిక్ష పడటం లేదని సీపీజే నివేదిక కుండబద్దలుకొట్టినట్లు చెప్పింది.
2023లో భారతదేశంలో కనీసం 35 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. చట్టపరంగానే వేధింపులకు గురయ్యారు. వీరిలో 20 మంది జర్నలిస్టులు వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు దాడులకు గురయ్యారు. 73 మంది జర్నలిస్టులపై అరెస్టు వారెంట్లు జారీ చేశారు. నలుగురు జర్నలిస్టులను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (jూఏపీఏ) కింద నిర్బంధించారు. ఆ ఏడాది మణిపూర్‌ (హింస కవరేజ్‌ కారణంగా), జవ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలలో పక్కువగా దాడులు జరిగాయి. 2024 సంవత్సర డేటా రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ నివేదిక 2024 (వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌) ప్రకారం, భారతదేశం 2024లో తన ర్యాంకింగ్‌లో 180 దేశాలలో 159వ స్థానంలో ఉంది. (2023లో 161వ స్థానం). ఈ మెరుగుదల ఉన్నప్పటికీ, మీడియా స్వేచ్ఛకు ముప్పు అధికంగానే ఉందని నివేదిక పేర్కొంది. జర్నలిస్టులు రాజకీయ ఉద్రిక్తతలు, ఉగ్రవాదం కారణంగా ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారు. 2025లో దేశవ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలను రిపోర్ట్‌ చేసినందుకు, అవినీతిని ప్రశ్నించినందుకు, వివాదాస్పద రాజకీయ అంశాలపై మాట్లాడినందుకు జర్నలిస్టులపై స్థానిక పోలీసులు, అధికారులు పఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, వారిని నిర్బంధించడం వంటి కేసులు నమోదయ్యాయి.
కేసులపై సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) కింద ఉన్న భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని 2024 అక్టోబర్‌లో వ్యాఖ్యానించింది. ఈ డేటా భారతదేశంలో జర్నలిజం వృత్తిలో పెరుగుతున్న ప్రమాదాలను, వారికి రక్షణ లేమి సమస్యను సూచిస్తుంది. జర్నలిస్టులకు ప్రత్యేకంగా హక్కులంటూ ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే, రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులు, సమాచార హక్కు చట్టం కల్పించిన అవకాశాలే జర్నలిస్టులు క్రియాశీలంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. రక్షణలేని వృత్తుల జాబితాలో జర్నలిజవూ ఉంది. వారి హక్కుల రక్షణకు కచ్చితంగా ప్రత్యేక చట్టం రావాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు