డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి
విశాలాంధ్ర – అనంతపురం : 104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలని డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి పేర్కొన్నారు.. బుధవారం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి తన కార్యాలయంలో 104 వాహనాల సేవలు కు సంబంధించి సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ… 104 సిబ్బంది సమయపాలన పాటించాలని ఉదయం 9, గంటల నుంచి సాయంత్రం 4 గంటలు దాకా వాహనంతో పాటు సంబంధిత సిబ్బంది వైద్యాధికారి, స్టాఫ్ నర్స్, కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సిబ్బంది, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం, ఆశాలు తప్పకుండా ఉండి క్యాంపు నిర్వహించే స్థలానికి ప్రజలకు మొబలైజేషన్ చేయాలని అన్ని వైద్య చికిత్సలు నిర్వహించి ఏ రోజుకు ఆరోజు ఆ యాప్ నందు రిపోర్ట్స్ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వైద్య సేవలు ముఖ్యంగా గర్భవతులు బాలింతలు చిన్న పిల్లలు ,దీర్ఘ వ్యాధిగ్రస్తులు, షుగర్, బిపి,మొదలగు వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు,
క్యాంప్ నిర్వహించు గ్రామాలలో స్కూల్ పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించి వారికి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది ఉదయం 9, గంటల నుంచి సాయంత్రం 4, గంటల లోపల శిబిరాలలో లేకపోయినా మరియు యాప్ లో రిపోర్ట్ చేయకపోయిన తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం లో డా.విష్ణుమూర్తి, 104 వాహన జిల్లా మేనేజర్ కిశోర్ నాయుడు పాల్గొన్నారు.
104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలి
- Advertisement -


