జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి
విశాలాంధ్ర – అనంతపురం టౌన్అ యోడిన్ ఉన్న ఉప్పును వాడాలని నీరసంగా ఉన్న విద్యార్థులను గుర్తించి వైద్యం అందించేలా చర్యలు తీసుకోమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు.
ప్రిన్స్ ఆఫ్ పీస్ స్కూల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అమాలి కాలనీ యందు, విద్యార్థులకు అయోడిన్ లోపంపై వైద్యులు సోమవారం పరీక్షలు నిర్వహించారు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి , ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ విష్ణుమూర్తి జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ జి ఆంజనేయులు, డాక్టర్ సారిక, విద్యార్థులను పర్యవేక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీదేవి మాట్లాడుతూ… జాతీయ అయోడిన్ లోపాల నివారణ కార్యక్రమ సర్వేలో దేశంలో రాష్ట్రం చివరి స్థానంలో ఉందని అందుకే ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు అనంతపురం జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సెలెక్ట్ చేసి 30 పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్వే చేస్తున్నామని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ… అయోడిన్ లోపంతో ఉన్న పిల్లల్ని గుర్తించి వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉప్పు ద్వారానే కాకుండా సముద్రపు చేపలు రొయ్యలు గుడ్లు, పాలు ఎన్నో పెరుగు కోడి మాంసం ద్వారా కూడా అయోడిన్ ను శరీరం గ్రహిస్తుంది అన్నారు
జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ ఆంజనేయులు మాట్లాడుతూ… అయోడిన్ తగ్గితే ఆరోగ్యానికి ముప్పు అని తెలియజేశారు,, దీనివల్ల అలసట బలహీనత అసహనం బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. థైరాయిడ్ గ్రంథి సరైన మోతాదులో హార్మోన్లను విడుదల చేయాలంటే అయోడిన్ తప్పనిసరి అన్నారు. అయోడిన్ ఉప్పు వల్ల అనేక లాభాలు ఉన్నాయని శారీరక మానసిక ఆరోగ్యం పెరుగుదల చురుకుదనానికి దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఇవి దేవి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విష్ణుమూర్తి, జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ జి ఆంజనేయులు, హమాలీ కాలనీ మెడకల్ ఆఫీసర్ డాక్టర్ సారిక, ఏఎన్ఎం ఆశ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
విద్యార్థులకు అయోడిన్ వైద్య పరీక్షలు
- Advertisement -


