Homeవిద్యుత్‌ భారాలు వ్యతిరేకిస్తూ 5న రాష్ట్రవ్యాప్త నిరసనలు

విద్యుత్‌ భారాలు వ్యతిరేకిస్తూ 5న రాష్ట్రవ్యాప్త నిరసనలు

- Advertisement -

రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పెంచిన విద్యుత్‌ చార్జీలు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జులై ఐదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు విద్యుత్‌ చార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించారని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని, అవసరమైతే పగలగొట్టాలని సూచించారని గుర్తుచేశారు. అదానీతో జరిగిన సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకివస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, అక్రమంగా జరిగిన సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు ఏడాది కాలంలో నాలుగు సార్లు విద్యుత్‌ భారాలను వినియోగదారులపై మోపారని చెప్పారు. గృహ వినియోగాలకు విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. గత జగన్‌ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల వల్ల 25 ఏళ్లపాటు దాదాపు లక్షా పదివేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందాలపై కూటమి ప్రభుత్వం కనీసం సమీక్షగాని, నోరు మెదపడంగానీ చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరుతో రూ.15,485 కోట్ల భారం ప్రజలపై మోపిందని, గృహాలకు స్మార్ట్‌ మీటర్లను బిగించేందుకు కుట్రపూరి తంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి విద్యుత్‌ చార్జీల భారాలను మోపటం ప్రజలను దారుణంగా మోసగించడమేనని అన్నారు. విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకో వాలని డిమాండ్‌ చేశారు. అదానీతో జరిగిన సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈనెల 25న విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు