Homeతెలంగాణసింగరేణి కార్మికులసంక్షేమానికి పెద్దపీట

సింగరేణి కార్మికులసంక్షేమానికి పెద్దపీట

- Advertisement -

. అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు
. ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం
. కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం
. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

విశాలాంధ్ర-హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా ప్రభుత్వం అధ్వర్యంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి ఉద్యోగుల మారుపేరు విషయంకు సంబంధించి తొందరగా పరిష్కారం చేస్తామని తెలిపారు. మెడికల్ ఇన్వాల్యుయేషన్ సంబంధించి వాళ్లకున్న జబ్బులకు సంబంధించి అన్ని విధాల పరిష్కారం చూపిస్తామన్నారు. కోల్ ఇండియా నిబంధన మేరకు సింగరేణిలో అధికారులకు అందించే సౌకర్యాలకు సమానంగా కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు (టాక్స్) కల్పించడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఐఫోర్ కమిటీని నియమించి సాకారం చేస్తుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ దేశంలో ఎక్కడా లేని రీతిలో 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, అలాగే 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేశామన్నారు. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగరేణిలో 2,539 పోస్టులను భర్తీ చేశామని, వీటిలో 798 ఎక్స్ టర్నల్ పోస్టులు ఉండగా… 1,741 కారుణ్య నియామక ఉద్యోగాలను ఇచ్చామని పేర్కొన్నారు. క్యాథ్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. 2024-25 లో సింగరేణి చరిత్రలో అత్యధిక లాభాలు (రూ.6,394 కోట్లు) సాధించాం. అత్యధికంగా 34 శాతం లాభాల వాటా కింద రూ.802 కోట్లను కార్మికులకు చెల్లించడం జరిగిందన్నారు. పొరుగు సేవల సిబ్బందికి రూ.5,500 చొప్ప్పున లాభాల వాటా చెల్లించడం జరిగిందని తెలిపారు.
దివ్యాంగుల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశాం
తమ ప్రభుత్వం ఈ రెండేళ్లలో దివ్యాంగుల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో ఆయన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన అనంతరం ప్రసంగించారు. చదువుకుం టున్న దివ్యాంగులకు ఐపాడ్లు, కంప్యూటర్లు ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోంది. మాది ప్రజా ప్రభుత్వం. దివ్యాంగులకు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాలన్నారు. సమాజంలో ఇతరులు కన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు