Friday, March 6, 2026
Homeజిల్లాలుఅనంతపురంఅంగన్వాడీల అరెస్టులు ఖండన

అంగన్వాడీల అరెస్టులు ఖండన

- Advertisement -

ఎస్ఎఫ్ఐ నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం : అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఎస్ఎఫ్ఐ శ్రీ సత్య సాయి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వంను అమలు చేయండని అడిగినందుకు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గం అని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా రోడ్డులో వారు బయటాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.మా ప్రభుత్వంలో ఎటువంటి నిర్బంధం ఉండదు, మాది పరదాల ప్రభుత్వం కాదు అని ప్రకటించిన వారు అంగన్వాడీ మహిళలను తెల్లవారి జామున నిర్బంధించి విజయవాడకు 100 కిమీ ల దూరం తీసుకెళ్లడం సరైనది కాదు అని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు