2003వ సంవత్సరం గోదావరి పుష్కరాలు. అశేష భక్త జనవాహిని. ఓ నాలుగైదు సంవత్సరాల కుర్రాడు అమ్మా… నాన్నా అంటూ గోదారొడ్డు మీద ఏడుస్తూ తిరుగుతున్నాడు. అందరూ ఎవరి భక్తి పారవశ్యంలో వారున్నారు. సాయంత్రం వరకూ అలా ఏడ్చిన కుర్రాడిని రైల్వే పోలీసులు చూశారు. చేరదీశారు. అన్నం పెట్టారు. ఊరు, పేరు అడిగారు. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడే తప్ప ఏం చెప్పడం లేదు. పుష్కరాల హడావుడి తగ్గింది. స్నానాలతో పుణ్యం వచ్చేసిందని విశ్వసించిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ పిల్లాడు రైల్వే పోలీసుల దగ్గరే ఉండిపోయాడు. ఆ పోలీసులకు తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో పరివర్తన అనే వీధిబాలలను చేరదీసే ఆశ్రమం ఉందని తెలిసింది. అక్కడికి తీసుకొచ్చి “వివరాలు తెలియవు, మీరే సాకండి” అంటూ ఆ ఆశ్రమ నిర్వాహకుడికి అప్పగించారు. అలా కుర్రాడిని చేతుల్లోకి తీసుకున్నది కాకినాడలో అనాథ ఆశ్రమం నడుపుతున్న వక్కలంక రామకృష్ణ.
x x x x
22 సంవత్సరాల క్రితం అలా ఆశ్రమానికి వచ్చిన కుర్రాడు ఇదిగో ఈమధ్యనే మహా ప్రాణదీపం శివం అంటూ పరవశంగా పాడిన హరిహరన్ దగ్గర సంగీత కళాశాలలో హిందూస్థానీ ఫ్యాకట్లీగా చేరాడు. ఈ ఫ్యాకల్టీ… గోదావరి పుష్కరాల రోజు తప్పిపోయిన రియాలిటీ ఒక్కరే. తేడా ఏంటయ్యా అంటే ఆ కుర్రాడ్ని హిందుస్థానీ సంగీత విద్వాంసుడిగా తీర్చిదిద్దింది అక్షరాల వక్కలంక రామకృష్ణే. ఆ పిల్లాడి పేరు చెప్పచ్చు. వక్కలంక రామకృష్ణ గారు నాకు చెప్పారు కూడా. కానీ నాకే చెప్పాలని లేదు. ఎందుకంటారా… ఆ పేరుతో పిలిచే ముందు పుష్కరాలకు తప్పిపోయిన కుర్రాడా అని అనేసుకుంటాం… ఆ కుర్రాడి దగ్గర అనేస్తాం. గాయం చేయడం కంటే దాన్ని రేపడం మరింత బాధాకరం. అందుకే చెప్పడం లేదు.
x x x x
ఇది ఇంకో సంఘటన. నాగార్జున (ఇదీ పేరు మార్చాను). హోటల్లో కప్పులు కడిగే వాడు. పునరావాసం అంటారు కాని నేను మాత్రం దాన్ని పునర¨న్మ అంటా. అలా ఆ కుర్రాడికి పునర¨న్మ ఇచ్చిందీ ఈ మన వక్కలంక రామకృష్ణే. ఆ నాగార్జునని ‘పరివర్తన’ కు తీసుకువచ్చి స్నానం చేయించి తన కడుపులో దాచుకున్నది తీసి తినిపించి స్కూల్‌కి పంపారు. వాడేం చేశాడు? మళ్లీ పారిపోయాడా? కానే కాదు. ఓ చేతిలో పెన్సిల్‌తో బొమ్మలేయడం ప్రారంభించాడు. ఏడో తరగతి చదువుతూండగా వేసిన బొమ్మలకి తెలంగాణలోని కొత్తగూడెంలో నిర్వహించిన బాలోత్సవ్‌లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాడు. ఈ బుడతడి బొమ్మలు చూసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు గారు మురిసిపోయి “నువ్వు నాకంటే కూడా బొమ్మలు బాగా వేయగలవు. ప్రాకీట్స్ చెయ్యి ” అంటూ ఆశ్వీరదించారు. అంతేనా ఇంకా ఉంది. బోల్డు బొమ్మల పుస్తకాలు కూడా ఇచ్చారని వక్కలంక రామకృష్ణ చెప్పారు. ఈ విషయం మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి.
x x x x
పరివర్తనకు ముందు రామకృష్ణ చదువంతా అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలోనే సాఫీగా సాగింది. ఆంధ్ర పుణ్యక్షేత్రాలు పాట రాసిన వక్కలంక లక్ష్మీˆపతిరావు గారి కుమారుడే ఈ రామకృష్ణ. తండ్రి కాలేజీలో తెలుగు లెకÌర్ర. ఆయనకే కాదు కాలేజీలో ఉద్యోగులందరికీ నాలుగైదు నెలలకే జీతాలు. అయినా లెకÌర్రలందరూ సొంత పిల్లలకి చెప్పినట్లే భావించి పాఠాలు చెప్పేవారు. తన కొడుకు రామకృష్ణకి చెప్పిన పాఠం ఏమిటంటే “ఆకలేస్తోందన్నా… సాయం చేయమని ఎవరైనా అడిగినా, నువ్వు మానేసి వారికి చేతనైన సాయం చెయ్యి” అన్నారట. ఆ చేతనైన సాయం అలా అలా పెరిగి “పరివర్తన”గా రూపాంతరం చెంది ఇప్పటివరకూ 750 మంది పిల్లలని పెంచి పెద్దవార్ని చేశారు. వారిలో చాలా మంది బాగా సెటిల్ అయ్యారని వక్కలంక రామకృష్ణ చెబుతూంటే సెల్‌ఫోన్ సిగ్నల్స్ బాగా పని చేశాయేమో ఆయన గొంతు జీర పోవడం నా ఎడమ చెవికి సోకింది. డిగ్రీ చదివేశాక ఎల్ఐసీలో చేరిన వక్కలంక రామకృష్ణ అక్కడ కూడా తన దగ్గరున్న ఏజెంట్లకి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. అమలాపురం కాలేజీలో చదువుతూండగానే కవిత్వంతో కూడా పరిచయం ఏర్పడిందని, అది తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వమని అన్నారాయన. రోటరాక్ట్లో చేరిన వక్కలంక రామకృష్ణ అనేక కార్యక్రమాలు చేసేవారు.కరోనా సమయంలో వక్కలంక రామకృష్ణ చేసిన సేవలు చాలా మంది చెప్పుకుంటారు. ఆయన మాత్రం నవ్వుతారు. “కష్ట సమయం కదా. చేయాలి కదా” అంటారు. వాటి వివరాలు అడిగితే కూడా “చేశాను కదా చక్రి… చెప్పుకోవడమెందుకు” అన్నారు. అసలివ్వన్నీ చెప్పుకోవడం ఎందుకంటే మానవత్వం ఇలాంటి వారి రూపంలో కనిపిస్తుందని… అంతే…
సీనియర్ జర్నలిస్ట్, 99120 19929
అతను… అనాధలకు అమ్మ
- Advertisement -


