Homeజాతీయంఅనిల్ అంబానీ నివాసం అటాచ్

అనిల్ అంబానీ నివాసం అటాచ్

- Advertisement -

ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ముంబై నివాసం ‘అబోడ’ను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తున్న ఈ విలాసవం తమైన ఇల్లు… ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉంది. దీని విలువ సుమారు రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో సంబంధం ఉన్న కేసులో భాగంగా ఆ ఇంటిని ఈడీ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరుకుంది. మరోవైపు… ఈ నెల 26న విచారణకు హాజరు కావాల్సిందిగా అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. 2025 ఆగస్టులో ఒకసారి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు