Tuesday, July 15, 2025
Homeఅంతర్జాతీయంఅవినీతి అధికారులపై చైనా వేటు

అవినీతి అధికారులపై చైనా వేటు

బీజింగ్‌ : చైనా సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ నుంచి కీలక జనరల్‌ మియా హువా, వైస్‌ అడ్మిరల్‌ లి హాంజున్‌పై వేటు పడిరది. పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌ ద్వారా హువాను కీలక సైన్యాధికారి పదవి నుంచి జిన్‌పింగ్‌ ప్రభుత్వం తప్పించినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడిరచింది. గతేడాది నవంబరులో తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై దర్యాప్తు చేపట్టారని తెలిపింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ రాజకీయ సిద్ధాంత విభాగానికి అధిపతిగానూ హువా గతంలో పనిచేశారని పేర్కొంది. రక్షణశాఖ వెబ్‌సైట్‌లో అధికారుల పేర్ల జాబితా నుంచి మియా హువా వివరాలు తొలగించడమే కాకుండా చైనా నేషనల్‌ లెజిస్లేచర్‌ నుంచి కూడా ఆయన పేరు తీసేశారని వెల్లడిరచింది. 14 నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి హోదా నుంచి కూడా హువాను తప్పించాలని సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ మార్చిలోనే నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేసింది. అవినీతి అధికారులను జిన్‌పింగ్‌ ప్రభుత్వం తొలగిస్తుండటం, వారికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటం విదితమే. అయితే మియా హువేతో జిన్‌పింగ్‌కు సాన్నిహిత్యం ఉంది. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో వీరిద్దరు కలిసి పనిచేశారు. హువాను సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌కు జిన్‌పింగ్‌ స్వయంగా తీసుకొచ్చారు. ఇదిలావుంటే, వైస్‌ అడ్మిరల్‌ లి హాంజున్‌ను పార్లమెంటరీ ప్రతినిధిగా తొలగించారు. ఈయన పీఎల్‌ఏ నేవీకి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా గతంలో పనిచేశారు. సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌కు చెందిన మరో కీలక నేత హీ వీడాంగ్‌పైనా ఇటీవల వేటు పడిన విషయం విదితమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు