విశాలాంధ్ర ధర్మవరం;; సేవా కార్యక్రమాలు మంచి గుర్తింపును ఇస్తాయి అని యువర్ ఫౌండేషన్ వైకె శ్రీనివాసులు, గర్రె రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి అన్నదాన కార్యక్రమానికి కీర్తిశేషులు ఎంవి. రమణప్ప, కీర్తిశేషులు ఆరోగ్యమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మాధవి మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం అనేది ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం పట్ల ఆసుపత్రి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేతా లోకేష్, యువర్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలు మంచి గుర్తింపును ఇస్తాయి.. యువర్స్ ఫౌండేషన్
- Advertisement -
RELATED ARTICLES


