Homeఅవినీతి లోకనాథం

అవినీతి లోకనాథం

- Advertisement -

టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు
భారీగా బంగారం, వెండి లభ్యం

విశాలాంధ్ర-తిరుమల:తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అవినీతి అధికారుల గుట్టురట్టు అయింది. డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ హించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం 6 గంటల నుంచి మొత్తం ఏడు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఇంట్లో 1.7 కేజీలకుపైగా బంగారం, 8.6 కేజీలకు పైగా వెండి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎస్‌టీవీ నగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు లాకర్‌ను తెరిచేందుకు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా స్థిరాస్తుల పత్రాలు, ఆభరణాల రశీదులను పరిశీలించారు. తిరుపతిలోని లోకనాథం నివాసంతో పాటు తిరుమలలోని వసతి గృహం, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఖరీదైన ప్లాట్లు, భూముల రిజిస్టేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల క్షేత్రంలో విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులపై ఏసీబీ సోదాలు దాదాపు దశాబ్దం తర్వాత జరిగాయి. డిప్యూటీ ఈవో ఇల్లు, ఆస్తుల తనిఖీలు సంచలనంగా మారింది. భక్తుల సేవల పేరిట లేదా ఆలయ నిర్వహణలో అక్రమాలు జరిగాయా అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. ఆస్తుల పూర్తి విలువ, మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు