టీ20 ప్రపంచకప్ పై ధోనీ
న్యూదిల్లీ: భారత్, శ్రీలంక వేదికగా ఈ నెల7 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవబోయే జట్టు ఏదనే దానిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవేనని చెప్పారు. అయితే, అన్ని జట్లలోకి భారత్ మరింత ప్రమాదకరమైన జట్టు అని, మన కుర్రాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని చెప్పాడు. పొట్టి ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, భారత జట్టులోని ఆటగాళ్లు అందరికీ ఒత్తిడిలో ఆడిన అనుభవం పుష్కలంగా ఉందని అన్నారు. ఎవరు ఏ పాత్ర పోషించాలో జట్టులోని సభ్యులకు స్పష్టంగా తెలుసని ధోనీ చెప్పారు. మంచి జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ టీమిండియాలో ఉన్నాయని వివరించారు. కాగా మ్యాచ్ జరిగే వేదికల్లో వాతావరణం తనను కలవరపరుస్తోందని ధోనీ చెప్పాడు. శీతాకాలం కావడంతో కొన్ని నగరాల్లో మంచు కురుస్తోందని, మ్యాచ్ పై దీని ప్రభావం చాలా ఉంటుందన్నాడు. ఇది చాలా విషయాలను ప్రభావితం చేస్తుందని, తాను ఆడుతున్న సమయంలోనూ డ్యూ (మంచు) అంటే భయాందోళనలకు గురయ్యానన్నాడు. ఇలాంటి సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? అన్న ప్రశ్నకు మొదట ధోని సరదాగా విననట్టు నటించినప్పటికీ వెంటనే సీరియస్‌గా స్పందిస్తూ… వయస్సు కంటే ఫిట్‌నెస్, ప్రదర్శనలే అసలైన ప్రమాణాలు అని తేల్చి చెప్పాడు. 2027 వరల్డ్ కప్ ఎందుకు ఆడకూడదు? వయస్సు ఎప్పుడూ ప్రమాణం కాదు.. ప్రదర్శన, ఫిట్‌నెస్ అసలు క్రైటీరియా అని మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. 22 ఏళ్లవాడైనా ఫిట్ లేకపోతే జట్టులో ఉండకూడదు… అదే 35 ఏళ్లవాడు ఫిట్‌గా, బాగా ఆడితే అతన్ని ఆడించాల్సిన అవసరం ఉందన్నాడు. తాను భారత జట్టులోకి వచ్చినప్పుడు తన వయస్సు గురించి ఎవరూ ప్రశ్నించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా అందరినీ సమానంగా చూడాలని సూచించాడు. ‘రోహిత్, విరాట్ లేదా భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్లు ఎవరికైనా ఒకే నియమాలు వర్తించాలి.. ఆడాలా వద్దా అన్నది వాళ్లే నిర్ణయించుకోవాలి. దేశం కోసం ఆడాలనే ఆకాంక్ష ఉంటే, ప్రదర్శన కొనసాగితే ఎందుకు ఆపాలి?’ అని ప్రశ్నించాడు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో అనుభవం ఎంత ముఖ్యమో కూడా వివరించాడు. 20 ఏళ్ల వయస్సులోనే అనుభవం వస్తుందనుకోరాదని… అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడే నిజమైన అనుభవం వస్తుందని స్పష్టం చేశాడుద. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే వాళ్లు లేదా లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు అనుభవం చాలా అవసరం అని తెలిపాడు. జట్టు ఎంపికలో యువత ఉత్సాహం, సీనియర్ల అనుభవం రెండూ అవసరమని మిస్టర్ కూల్ ధోని అభిప్రాయపడ్డాడు. అయితే, 24 ఏళ్ల ఆటగాడికి ఎలాంటి ప్రమాణాలు ఉంటాయో, 35 ఏళ్ల ప్లేయర్‌కి కూడా అవే ఉండాలని సూచించాడు. ప్రదర్శన ఉంటే ఆడతారు… లేకపోతే ఎప్పుడైనా జట్టులో నుంచి తప్పిస్తారన్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి గురించి ప్రశ్నే ఉండకూడదని తేల్చేశాడు.
ఈసారి అన్ని జట్లూ ప్రమాదకరమే
- Advertisement -


