Homeఉగ్రవాదంపై ఇజ్రాయిల్ పోరుకు భారత్ అండ

ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ పోరుకు భారత్ అండ

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ
తెలఅవీవ్:ఇజ్రాయిల్ పార్లమెంటులో ప్రసంగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌తో 140 కోట్ల మంది భారతీయులకు స్నేహం, గౌరవం, భాగస్వామ్యం ఉన్నాయని చెప్పారు. “ఉగ్రవాదానికి మేం పూర్తిగా వ్యతిరేకం. భారత్ అనేక దశాబ్దాలుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతోంది. హమాస్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయిల్‌కు పూర్తిగా అండగా ఉంటాం” అని మోదీ అన్నారు. భారత్, ఇజ్రాయిల్ ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని… ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిని తానేనని తెలిపారు. ఇజ్రాయిల్‌కు రెండోసారి రావడం సంతోషంగా ఉందన్నారు. “ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడుల పట్ల నా ప్రగాఢ సానుభూతి. టెర్రరిజాన్ని ఉపేక్షించేది లేదు. రెండోమాట ప్రసక్తే లేదు.. టెర్రరిజంపై ప్రపంచ దేశాలు కలసికట్టుగా పోరాడాలి. టెర్రరిజం ఎక్కడున్నా నిర్మూలించేందుకు భారత్ సహకరిస్తుంది. ఉగ్రవాదానికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయిల్‌కు పూర్తిగా అండగా ఉన్నాం’ అని అన్నారు. కాగా ఇజ్రాయిల్ పార్లమెంట్ ‘నెస్సెట’ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టిం చారు. తొలుత ఆయన పార్లమెంటులోకి రాగానే సభ్యులందరూ లేచి నిలబడి చప్ప ట్లతో “మోదీ… మోదీ” అనే నినాదాలతో స్వాగతం పలికారు. అనంతరం నెస్సెట్ స్పీకర్ అమీర్ ఒహానా హిందీలో “నమస్తే”, “జెరూసలేంకు స్వాగతం” అని మోదీకి ఆహ్వానం పలికారు. “భారతదేశం ప్రపంచం లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం. ముంబై దాడుల సమయంలోనైనా, పహల్గామ్ ఘటనలోనైనా ఇజ్రాయిల్ ఎప్పుడూ భారత్‌కు అండగా ఉంటూ వస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే యూదులకు ఆశ్రయం ఇచ్చిన దేశంగా భారత్‌పై గౌరవాన్ని ప్రకటించారు.
మోదీ సోదరుడికంటే ఎక్కువ: నెతన్యాహు
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ… మోదీతో ఆలింగనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోదీ ఎవరినైనా కౌగిలించుకుంటే అది కేవలం పైపైన చేసే పని కాదు, అది హృదయపూర్వకమైనది. దానినే ప్రపంచవ్యాప్తంగా ‘మోదీ హగ’ అని పిలుస్తున్నారు. నాకు నరేంద్ర మోదీ మిత్రుడు మాత్రమే కాదు.. .సోదరుడి కంటే ఎక్కువ. మోదీ భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఇజ్రాయిల్‌కు మోదీ ప్రధాన స్నేహి తుడు, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపయ్యాయి. ఇరుదేశాల మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సహ కారం 4 రెట్లు పెరిగింది” అన్నారు. భారతదేశం 140 కోట్ల జనాభాతో ఒక మహాశక్తి అని, ఇజ్రాయిల్ చిన్న దేశమైనా సాంకేతికంగా చాలా పెద్దదని అన్నారు. ఈ రెండు దేశాల కలయిక వల్ల ప్రపంచంలో పనితీరు, సామర్థ్యం, భావోద్వేగాలు రెట్టింపు అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా యూదులపై దాడులు లేదా వ్యతిరేకత పెరిగిన చరిత్ర ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం యూదులను ఎప్పుడూ వేధించలేదని, పైగా సాదరంగా ఆహ్వానించిందని నెతన్యాహు గుర్తు చేసుకున్నారు. ఈ గొప్ప మనసున్న భారత్‌కు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ఘన స్వాగతం
భారత ప్రధాని నరేంద్రమోదీకి ఇజ్రాయిల్‌లో ఘన స్వాగతం లభించింది. రెండురోజుల పర్యటన కోసం టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీసమేతంగా స్వాగతం పలికారు. ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ విమానాశ్రయానికి చేరుకున్న నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్‌తో సైనిక గౌరవ వందనం సమర్పించింది. అనంతరం విమానాశ్రయంలో నెతన్యాహుతో మోదీ కొంత సేపు ముచ్చటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు