Homeఎస్‌ఐఆర్ గడువు పెంపు

ఎస్‌ఐఆర్ గడువు పెంపు

- Advertisement -

10 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితా

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఐఆర్ షెడ్యూలును సవరించి… గడువును రాష్ట్ర ఎన్నికల కార్యాలయం పొడిగించింది. సవరించిన షెడ్యూలు ప్రకారం ఓటర్ల జాబితాలపై క్లైయిమ్లు, అభ్యంతరాలను ఈ నెల 10 వరకు దాఖలు చేసుకోవాలి. ఓటర్ల నుంచి అందే క్లైయిమ్లు, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు అక్టోబరు 5 వరకు అవకాశం కల్పించారు. అనంతరం అన్ని ప్రక్రియలను పూర్తిచేసి అక్టోబరు 9 న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఓటర్లకు తమ వివరాలను పరిశీలించుకుని ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే గడువులోగా తెలియజేసే అవకాశం పెరిగింది. సవరించిన ఎస్‌ఐఆర్ షెడ్యూలును వెంటనే రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించాలని, షెడ్యూల్‌లో చేసిన మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులయిన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు అనర్హులయిన లేదా నమోదయిన వివరాలను సరిచేసేందుకు క్లైయిమ్లు, అభ్యంతరాల ప్రక్రియ కీలకంగా ఉంటుంది. గడువు పొడిగింపుతో ఓటర్లకు తమ వివరాలను పరిశీలించుకునేందుకు అదనపు సమయం లభించనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు