విశాలాంధ్ర వైరా : మాయమాటలు, మోసపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం మాజీ ఎంపీ, మాజీ బీఆరఎస్ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావు విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతిలతో కలిసి వైరా 5వ వార్డు బీఆరఎస్ చైర్మన్ అభ్యర్థి కట్టా స్వరూపరాణి, 6వ వార్డు సీపీఎం అభ్యర్థి మాదినేని రజిని, 12వ వార్డు బీఆరఎస్ అభ్యర్థి మాదినేని సునీత గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు అమలు సాధ్యం కాని ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ. 2500, పెన్షన్లు రూ. 4000, దివ్యాంగులకు రూ.6000 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆడబిడ్డల పెళ్లికి ‘కళ్యాణ లక్ష్మీ’, ‘షాదీ ముబారక’ పథకాల కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించామని, దానికి తులం బంగారం కలిపి ఇస్తామని కాంగ్రెస్ చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందన్నారు. రైతులు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తాగునీరు, సాగునీరు, విద్యుత్ కోతలు లాంటి సమస్యలు లేకుండా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని టీడీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ శ్రేణులు తమతో కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలోనే వైరా మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. మరోసారి బీఆరఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.
రాజకీయ కేంద్రం…. చైతన్యవంతమైన ప్రజలు
వైరా ఖమ్మం జిల్లాలో ఒక రాజకీయ కేంద్రం ఇక్కడ చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగా మేమంతా అన్నారు శుక్రవారం , వైరా మున్సిపాలిటీలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సిపిఐ రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌తో కలిసి 6 వార్డు సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థిని మాదినేని రజిని ,5 వార్డు లో బిఆరఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కట్టా స్వరూప రాణి ని,12 వార్డులో బిఆరఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాదినేని సునీత ను గెలిపించాలని భాగం ఏ మంత్రం అన్నారు, సందర్భంగా వైరా గాంధీ చౌక్‌లో జరిగిన కుడలి సభలో భాగం హేమంతరావు మాట్లాడుతూ. ఈ ఎన్నికల్లో బిఆరఎస్ సిపిఐ సిపిఎం ఒక రాజకీయ వరవడికి నాంది పలికాయి. వైరా మున్సిపాలిటీలో 15వ వార్డులో మాత్రమే సిపిఐ పోటీ చేస్తుంది మిగతా 19 వార్డులలో బిఆరఎస్ సీపీఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారు, సిపిఎం పార్టీ సుత్తి కొడవలి గుర్తుకు, బిఆరఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని హేమంతరావు తెలిపారు. మున్సిపాలిటీలోని సిపిఐ శ్రేణులు అందరూ 15వ వార్డులో కంకి కొడవలి గుర్తుకి, మిగతా అన్ని వార్డులలో బిఆరఎస్ కారు గుర్తుకి ,సిపిఎం సుత్తి కొండవాలి నక్షత్రం గుర్తుకి ఓటు వేయాలి అని కోరారు. వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురాబోతుంది . వైరా ప్రాంతం అంటే స్వర్గీయ అమరజీవి బోడెపుడి వెంకటేశ్వరరావు లాంటి మహానుభావులు గుర్తొస్తారు. అలాంటి మహానుభావుల ఆశయాలను మనం బతికించుకోవాలి అంటే వైరా మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా కట్టా స్వరూప రాణి ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అందరూ సమన్వయంతో ముందుకు పోయి కూటమిని విజయ బాటలో నడిపించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు : నామా
- Advertisement -
RELATED ARTICLES


