Wednesday, February 18, 2026
Homeతెలంగాణకే ఎల్ ఎస్ ఆర్ సీఎం బినామీ కంపెనీ

కే ఎల్ ఎస్ ఆర్ సీఎం బినామీ కంపెనీ

- Advertisement -

. దివాలా సంస్థ ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలి
. సిట్ విచారణ పేరుతో డ్రామాలు
. కిషన్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కేటీఆర్

విశాలాంధ్ర-హైదరాబాద్: తన బినామీ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేఎలఎసఆర్ కంపెనీ… సీఎంకు ఏ విధంగా బినామీ కంపెనీగా పనిచేస్తుందో బుధవారం మీడియా సమావేశంలో ఆధారాలతో సహా బయటపెట్టారు. తన అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే దావోస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి… సిట్ విచారణ పేరుతో డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. కేఎలఎసఆర్ కంపెనీపై 2018లో ఈడీ, ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారని తెలిపారు. అప్ప్పుడే పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డికి … ఈ కంపెనీకి ఉన్న సంబంధాల గురించి మీడియా బయటపెట్టిందన్నారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దివాళా తీసి ఎన్‌సీఎల్‌టీలో దివాళా ప్రక్రియ కేసు నడుస్తున్న ఈ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి భుజాల పైకి ఎత్తుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ, కేఎలఎసఆర్ కంపెనీ మధ్య నిధులు చేతులు మారిన విషయాన్ని, ట్యాక్స్ ఎగవేతలను ఈ దాడుల్లో గుర్తించారన్నారు. భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య కంపెనీల డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండు కంపెనీలు రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలన్నారు. అయితే ఈ కంపెనీ కేఎలఎసఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఒక బినామీ అని అందరికీ తెలుసు అన్నారు. ఎన్‌సీఎల్‌టీ లోనూ జడ్జిల ద్వారా కంపెనీకి సానుకూలంగా తీర్పు వచ్చేలా నిలబడింది రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. దివాళా తీసిన కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డి హయాంలో రూ.ఆరువేల కోట్ల ప్రాజెక్టులు ఎలా పొందిందో సమాధానం చెప్పాలన్నారు. 2023 నుంచే దివాళా తీసిన కంపెనీకి 2024-26లో ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీలోకి వచ్చిన వందల కోట్ల రూపాయల నిధులపైన విచారణ జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం కోసమే తనతో పాటు హరీశ్‌రావు, సంతోశ్‌రావు, పార్టీ అధినేత కేసీఆర్‌ని… టెలిఫోన్ ట్యాపింగ్ సిట్ నోటీసుల పేరిట దావోస్ నుంచి స్వయంగా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపించారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లు … సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఆ కంపెనీకిచ్చిన ప్రతి కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తి అయ్యేదాకా ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ఈ వ్యవహారంలో కిషన్ రెడ్డి స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి విచారణ జరిపించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు