Homeఅంతర్జాతీయంగల్ఫ్ మళ్లీ భగ్గు

గల్ఫ్ మళ్లీ భగ్గు

- Advertisement -

– విరుచుకుపడ్డ అమెరికా: దీటుగా బదులిచ్చిన ఇరాన్
– దూకుడు ఆపకపోతే హోర్మూజ్ తెరుచుకోదని స్పష్టీకరణ
– దిగ్బంధాలకు ట్రంప్ హెచ్చరికలు… 20 శాతం సుంకం ప్రతిపాదన
– జల సంధిలో రెండు నౌకలపై తెహ్రాన్ దాడి
– ఓ నావికుడి మృతి: ఎనిమిది మందికి గాయాలు

తెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. హోర్మూజ్ వెంబడి దాడులతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాత్కాలిక ఒప్పందానికి తూట్లు పొడిచే విధంగా అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ మళ్లీ రణరంగంగా మారిపోయింది. ఇరాన్ నౌకలపై దిగ్బంధనాన్ని విధిస్తామని, జలసంధి గుండా వెళ్లే ఇతర సరుకు రవాణాపై 20 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంలో ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. హోర్మూజ్ జల సంధి విషయంలో అమెరికా దూకుడు ఇరాన్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అమెరికా తన దుందుడుకు చర్యలు ఆపకపోతే జల సంధి మళ్లీ తెరుచుకోదని తేల్చిచెప్పింది. ఇదే క్రమంలో హోర్మూజ్ జలసంధిని ‘రెడ్ లైన్’గా ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ మార్గంలో అమెరికా దురాక్రమణ లేదా జోక్యానికి ప్రతిస్పందన తప్పబోదని హెచ్చరించింది. అమెరికా నౌకలను అనుమతించబోమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ తేల్చిచెప్పింది. ఇరాన్‌పై మంగళవారం తెల్లవారుజామున అమెరికా సైన్యం విరుచుకుపడింది. జల సంధి ద్వారా వెళ్లే కొన్ని నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. అమెరికాకు, పశ్చిమాసియాలోని దాని మిత్రపక్షాలకు తెహ్రార్ దీటుగా బదులిచ్చింది. ఇరాన్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేశామని, కోస్తా రక్షణ వ్యవస్థలు, క్షిపణులు`డ్రోన్ల కేంద్రాలు, మేరీటైమ్ స్థావరాలపై గురి పెట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఏమేరకు నష్టం జరిగిందో వెల్లడించలేదు. ఇరాన్ దళాలు భారీ మూల్యం చెల్లించుకునే స్థాయి దాడులు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్త దాడులు జరిగిన వెంటనే ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది మరో భారీ దాడిగా పేర్కొన్నారు. అమెరికా మరోమారు దిగ్బంధనం విధిస్తోందని ప్రకటించారు. దీంతో బహ్రెయిన్, జోర్డాన్, యూఏఈతో ముడిపడ్డ రెండు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ ప్రతిస్పందించింది. హోర్మూజ్ గుండా ప్రయాణించే ఆ రెండు నౌకలను తగలబెట్టేసింది. బుష్నేర్ పోర్టు నగరంపై అమెరికా దాడి చేసినట్లు తెలిపింది. కాగా, మొంబాసా, అల్ బహియా నౌకలపై దాడిలో ఒక నావికుడు చనిపోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ప్రతిదాడులకు అవకాశం లేకపోలేదని హెచ్చరించింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఐఆర్‌జీసీ ప్రకటన చేసింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ నౌకలు పట్టించుకోÅ£పోవడంతోనే దాడి చేసినట్లు వెల్లడించింది. అలాగే యూఎస్ నేవీ ఫిఫ్త ఫ్లీట్‌కు నిలయమైన బహ్రెయిన్‌పై తెహ్రాన్ దాడులతో మూడుసార్లు సైరన్లు మోగాయి. ప్రజలు సురక్షిత స్థావరాల్లోకి వెళ్లేలా సూచనలు జారీ అయ్యాయి. ఇదిలావుంటే ఇరాన్ ప్రయోగించిన నాలుగు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది.
ఒక్కో ట్యాంకర్‌కు రూ.287 కోట్లు?
హర్మూజ్ జలసంధిలో రవాణా నౌకలకు రక్షణ కల్పించేందుకు ట్రంప్ 20 శాతం టోల్ ప్రతిపాదించారు. అంటే ప్రతి చమురు సూపర్ ట్యాంకర్ నుంచి అమెరికా 30 మిలియన్ డాలర్లు (రూ.287 కోట్లు) వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని బ్లూమ్బెర్గ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం బ్యారెల్‌కు 80 డాలర్లుగా చమురు ధర లెక్కేసుకొన్నా.. వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ (వీఎల్‌సీసీ)లో 20 లక్షల బ్యారెళ్ల చమురు పడుతుంది. దీని విలువ 160 మిలియన్ డాలర్లు కాగా 20 టోల్ అంటే ఒక్కో నౌకపై 30-32 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఇరాన్ ఒక్కో నౌకపై రెండు మిలియన్ (సుమారు రూ.19 కోట్లు) డాలర్లు వసూలు చేస్తోంది. ఇది తాత్కాలిక ప్రాతిపదకనే జరుగుతోంది. ట్రంప్ ప్రతిపాదనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ ‘మేము వాణిజ్య నౌకలను సురక్షితంగా జలసంధిని దాటించగలం. ఆ సేవలకు సొమ్ము తీసుకొంటాం. అమెరికా చెప్పే 20 శాతం చాలా ఎక్కువ. మేము సముచితంగా రుసుము వసూలు చేస్తాం’ అని పేర్కొన్నారు.
అమెరికా సముద్ర దొంగ? లూలా డా సిల్వా
సావోపోలో: హోర్మూజ్ గుండా సురక్షిత ప్రయాణానికిగాను తమకు 20 శాతం సుంకం చెల్లించాలన్న ట్రంప్ ప్రతిపాదనపై ప్రపంచ నాయకులు భిన్నరీతిల్లో స్పందించారు. అమెరికా సముద్ర దొంగలా దేశమా అంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సావో పోలోలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘అధ్యక్షుడు ట్రంప్ ఓ ప్రతిపాదన చేశారు. హోర్మూజ్ జల సంధి గుండా వెళ్లే ప్రతి నౌకకు 20 శాతం సుంకం విధిస్తామన్నారు. ఇది పైరసీ (సముద్ర దొంగతనం). అమెరికా వంటి పెద్ద దేశం దొంగల రాజ్యంగా మారిపోయిందా’ అని లూలా వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం సముద్ర దొంగలపై పోరాటం చేసిన అమెరికా ఇప్పుడే ఆ పనే చేయబోతోందా అని బ్రెజిల్ అధ్యక్షుడు ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు