Homeఆంధ్రప్రదేశ్బీసీ వసతి గృహంలో ఇద్దరు మహిళా వార్డెన్ ఉన్న పర్యవేక్షణ కరువు

బీసీ వసతి గృహంలో ఇద్దరు మహిళా వార్డెన్ ఉన్న పర్యవేక్షణ కరువు

- Advertisement -

15 రోజులుగా నీరు లేక బకెట్లతో వీధుల్లోకి విద్యార్థినులు

ఎస్సీ బాలికల వసతి గృహంలో త్రాగునీరు అంతంత మాత్రం మే

బయోమెట్రిక్ హాజరుకే పరిమితమవుతున్నారా?తల్లిదండ్రుల ఆవేదన

విశాలాంధ్ర పుత్తూరు

నాలుగు దశాబ్దాలకు పైగా పేద, దళిత, వెనుకబడిన వర్గాల బాలికల చదువులకు అండగా నిలిచిన వసతి గృహాలు నేడు కనీస అవసరమైన తాగునీటి కోసం ఎదురుచూస్తున్న దుస్థితి నెలకొంది. పుత్తూరు పట్టణంలోని మార్కెట్ యార్డు వెనుక భాగంలో ఉన్న ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాల్లో గత 15 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం పుత్తూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం 1984లో స్థాపించబడింది.100 మంది విద్యార్థినుల సామర్థ్యంతో ఏర్పాటైన ఈ వసతి గృహంలో 2023–24 విద్యా సంవత్సరానికి 79 మంది విద్యార్థినులు ఉన్నట్లు గత రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2026 నాటికి 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఈ వసతి గృహం ఎందరో పేద విద్యార్థినుల విద్యాభివృద్ధికి ఆసరాగా నిలిచింది. అయితే ప్రస్తుతం వసతి గృహంలో తాగునీరు అందుబాటులో లేక విద్యార్థినులు బకెట్లు పట్టుకొని సమీపంలోని దళితవాడ వీధుల్లో ఒక బకెట్ నీటి కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చదువుకోవాల్సిన సమయంలో బాలికలు నీటి కోసం రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమని వాపోతున్నారు. బీసీ బాలికల వసతి గృహంలో ముగ్గురు మహిళా వార్డెన్లు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, భోజనం, ఇతర కనీస అవసరాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందించడం లేదనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమ బిడ్డలు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో ప్రభుత్వ వసతి గృహాలకు పంపితే, కనీస సౌకర్యాల విషయంలోనే నిర్లక్ష్యం ఎదురవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా బిడ్డలను చదువుకోవడానికి పంపామా బకెట్ పట్టుకొని నీటి కోసం వీధుల్లో తిరగడానికి పంపామా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ హాస్టల్ కి బోర్డు. మరమ్మతుకు నోచుకోలేదు కొంతకాలం క్రితమే తుప్పు పట్టిపోవడంతో తీసి పక్కన పడేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని కోరుతున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు మెనూ అమలు, వార్డెన్ల హాజరు, రాత్రివేళ పర్యవేక్షణపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు