Friday, March 6, 2026
Homeవిశ్లేషణచిన్న రైతుల జీవనోపాధికి ముప్ప్పు

చిన్న రైతుల జీవనోపాధికి ముప్ప్పు

- Advertisement -

సోమ మర్ల

ఫిబ్రవరి 2 వ తేదీ తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఐతే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే ప్రతిఫలంగా భారత ఎగుమతులపై సుంకాలను 50 నుంచి 18 శాతానికి తగ్గిస్తామని,అన్ని అమెరికన్ వస్తువులపై భారత సుంకాలు సున్నా శాతానికి తగ్గుతాయని ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం వరకు మన వాణిజ్య శాఖా మంత్రి పియూష్ గోయల్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఐతే మన మీడియా, పాలక బిజెపి, సుంకాల తగ్గింపును ప్రధాని మోదీ విజయంగా పేర్కొన్నారు. వాస్తవానికి ఇది వ్యవసాయం, పరిశ్రమలకు రాజకీయంగా, ఆర్థికంగా హాని కలిగించే ఒప్పందం. ముఖ్యంగా 0% సుంకం అంటే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేయడమే. అమెరికా నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతి విషయంలో భారతదేశం రాజీ పడలేదని చెప్ప్పుకొచ్చారు వాణిజ్య శాఖా మంత్రి. అయితే, ఈ ఒప్పందం గురించి అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ చేసిన ప్రకటన చూస్తే భారతదేశ వాణిజ్య శాఖా మంత్రి భారతదేశాన్ని మోసం చేశారనడానికి నిదర్శనం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ ‘పండ్లు, కూరగాయలు, సోయా, మొక్కజొన్నతో పాటు అనేక వైద్యపరికరాలు, రసాయనాలు ,ఇతర పారిశ్రామిక వస్తువులు’ వంటి వాటిపై సుంకాలను సున్నా శాతానికి తగ్గించనుంది. దీంతో అమెరికా వ్యవసాయ శాఖా మంత్రి మేడమ్ బ్రూక్ రోలిన్స్ తన ఎక్స్ పోస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అమెరికన్ రైతులకు మద్దతు ఇచ్చినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్-అమెరికా కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు భారత్‌లోని భారీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయి. దీంతో అమెరికా రైతుల ఉత్పత్తుల ధరలు పెరిగి, వారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది అంటూ అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ పేర్కొన్నారు. దాదాపు ఏడాది పాటు సాగిన చర్చల తర్వాత భారత్`అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి ఆకస్మాత్తుగా ప్రకటించేశారు. ఐతే ఇంత హడావుడిగా ఈ ఒప్పందం గురించి ప్రకటించాల్సిన అవసరం ఏంటి అన్నదే ఇప్ప్పుడు ప్రశ్న. ఎప్స్టీన్ ఫైల్స్‌లో భారత్‌కు చెందిన కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం గురించి వెల్లడైన విషయాలు, బిలియనీర్ గౌతమ్ అదానీ అరెస్టుకు సమన్లు జారీ చేయడం వంటి విషయాలు ఈ ఒప్పందం వెనక కీలక పాత్ర పోషించాయా అనేది స్పష్టత రావాలి. ఈ ఒప్పందంలో భాగంగానే మిత్రదేశమైన రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేయడానికి భారత్ అంగీకరించింది.భారత్ ఇప్పటివరకూ రష్యా నుంచి బ్యారెల్ చమురును చౌకగా 10 నుంచి 15 అమెరికన్ డాలర్లకు అలాగే ఇరాన్ ఇంకా చవకగా అంటే 10 డాలర్లకే చమురు దిగుమతి చేసుకునేది. కానీ ఇప్ప్పుడు అమెరికా, వెనిజులా నుంచి 15 శాతం ఎక్కువ ధరకు చమురు దిగుమతికి భారత్ ఒప్ప్పుకుంది. ఈ ప్రయోజనాలన్నీ అంబానీ, అదానీ చమురుశుద్ధి కర్మగారాలకే చేరుతున్నాయి. ఇది అమెరికన్ ఆర్థిక సామ్రాజ్యవాదం ముందు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడమే. వ్యవసాయం, పాడి పరిశ్రమ అంశాలు ఈ ఒప్పందంలో లేవని మంత్రి పియూష్ గోయల్ చెబుతున్నప్పటికి తెర వెనుక జరుగుతున్న పరిణామాలు మరొక రకంగా ఉన్నాయి. అమెరికా భారత్ నుంచి 3.4 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది, అందులో జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, వంటనూనెలు, బాస్మతి బియ్యం, మామిడి, తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు, కూరగాయలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా భారత్ అమెరిక నుంచి ఆపిల్స్, గింజలు, పతి, కొన్ని రకాల బెర్రీలు అంటే 2.1 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. గతంలో భారత్ అమెరికాకు 2 నుంచి 3% సుంకంతో ఎగుమతి చేసేది. ఈ రంగంలో దాదాపు 1.3 బిలియన్ డాలర్ల మిగులు ఉండేది. ఐతే జన్యుపరంగా మార్పు చేయబడిన మొక్కజొన్న, సోయాను దిగుమతి చేసుకోవడానికి భారత్ ఇష్టపడటం లేదు. ఇది అమెరికన్ సంస్థను చికాకుపెడుతోంది.
రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా : అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మొక్కజొన్న, పత్తి, కూరగాయల నూనెలు, ఆపిల్స్, పాల ఉత్పత్తులపై 0 శాతం సుంకాలు విధించడం ద్వారా భారతీయ మార్కెట్లలో ధరలు పడిపోయే అవకాశం ఉంది.2020 వ్యవసాయ వనరుల నిర్వహణ సర్వే ప్రకారం ఒక అమెరికా రైతుకు సంవత్సరానికి 66,314 డాలర్లు సబ్సిడీగా అందుతుంది. అంటే సాగు ఖర్చులలో 39 శాతం అన్నమాట. భారత్‌లో 14.9 కోట్ల మంచి రైతులు ఉండగా, అమెరికాలో కేవలం 18.4 లక్షల మంది రైతులే ఉన్నారు. వాళ్లకు మనకు సంఖ్యలో అసలు పొంతనే లేదు.ఎరువుల సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటి విషయాల్లో భారత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 7 శాతం సబ్సిడీనే. గిట్టుబాటు ధరలు లేక చిన్న, సన్నకారు రైతులు అప్పులపాలౌతున్నారు. సున్నా శాతం దిగుమతి సుంకాలు ద్వారా రైతులు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఒప్పందం కోట్లాది మంది చిన్న రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని నాశనం చేస్తుంది. గ్రామాల్లో, రైతులు, కార్మికులు ఆదాయం కోసం ఆవులు, గేదెలు, కోళ్లను పెంచుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా మహిళా రైతులు పశువులను పెంచి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తుంది. అమెరిక నుంచి చీజ్, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, ఇతర పాల ఉత్పత్తులను, కోడి కాళ్ళు, మాంసం అనుమతిస్తే చిన్నతరహా పాడి పరిశ్రమ నాశనం అవుతుంది. భారత్‌లో తాజాగా ఉత్పత్తయ్యే పాలల్లో దాదాపు 40శాతం, చాక్లెట్లు, పాలపొడి, ఐస్‌క్రీములు, నెయ్యి, పనీర్ ఉత్పత్తికి వినియోగిస్తారు. ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తుల వ్యాపారానికి భారత్ చాలా పెద్ద మార్కెట్. చౌకైన సోయా, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు, పసుపు, బఠానీ, వేరుశనగ, భారతీయ మార్కెట్లలోకి ప్రవేశిస్తే మాత్రం దేశీయ రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. పొలం వదిలేసి పట్టణం వెళ్లాల్సిందే. అమెరికన్ బహుళజాతి సంస్థలు కీలకమైన ఆహార రంగాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే దేశ ఆహార భద్రతకు ముప్పు కలిగించడమే. మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ,స్వతంత్రాన్ని సవాల్ చేసినట్టే. దీనివలన దేశం మళ్లీ వలసకాలం నాటి ‘బనానా రిపబ్లిక’కు వెళ్లిపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత వాణిజ్య ఒప్పందం ప్రకారం, భారతదేశం 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులను సున్నా శాతం సుంకంతో కొనుగోలు చేస్తుంది. అంటే మనం కస్టమ్స్ సుంకం నుంచి భారీ ఆదాయ వనరులను కోల్పోతాం. తద్వారా మన ఖజానాకు ప్రమాదం ఏర్పడుతుంది. మన దేశ వార్షిక బడ్జెట్ 53 లక్షల కోట్లు మాత్రమే. అంటే దాదాపు 513 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ఈ ఒప్పందం ప్రకారం మనం టెస్లా కార్లు, చమురు, గ్యాస్, బొగ్గు, ఫైటర్ జెట్‌లు, రక్షణ పరికరాలు, మొక్కజొన్న, ఆపిల్స్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీని కారణంగా ఇతర దేశాలతో వ్యాపారం చేయడం మానేసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం చైనాతో వాణిజ్యంలో 150 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. భారత్ అమెరికాకు బానిసైపోతే మనం చైనా, ఇతర దేశాలతో ఎలా ్యపారం చేయగలుగుతాం. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ వాణిజ్య ఒప్పందంలో భారత్ అమెరికాకు ఎగుమతి చేసే లోహ ఉత్పత్తులు అంటే స్టీల్ సుమారు 10 బిలియన్ డాలర్లు, అల్యూమినియం సుమారు 7 బిలియన్ డాలర్లను చేర్చలేదు. అమెరికాలోని ప్రత్యేక వాణిజ్య చట్టాల కారణంగా, ఈ రంగాలపై 18 శాతం తగ్గించిన సుంకం వర్తించదు. ఫలితంగా, ఈ ఉత్పత్తులపై భారత్ ఇప్పటిలాగే సుమారు 50 శాతం వరకు ఉన్న అధిక సుంకాలను చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తే, ఈ వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనాలకు, వారి జీవనోపాధికి, దేశ ఆహార భద్రతకు మొత్తం ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీస్తుంది. అందుకే ఇలాంటి కీలకమైన వాణిజ్య ఒప్పందాలు పార్లమెంటులో విస్తృత చర్చకు రావాలి. పూర్తి పారదర్శకతతో ఉండేలా ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విత్తనాలు, ఆహార రంగాలు అత్యంత కీలకమైనవి. ఇతర దేశాలతో వాణిజ్యం చేయడమే కాదు దేశ ప్రజల నిర్ణయాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం అనివార్యం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు