Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజులై నెల 30-31 తేదీలలో కలెక్టరేట్ల ధర్నాను జయప్రదం చేద్దాం

జులై నెల 30-31 తేదీలలో కలెక్టరేట్ల ధర్నాను జయప్రదం చేద్దాం

- Advertisement -

జిల్లా అధ్యక్షులు అయుబుకాన్
విశాలాంధ్ర – ధర్మవరం : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మినిమం టైం స్కేల్ అమలు, రేగులరైజేషన్ సమస్యలపై జూలై 30, 31 వ తేదీలలో కలెక్టరేట్ల వద్ద ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయుప్కాన్, పెద్దన్న, ఎస్ హెచ్ భాష, ఆదినారాయణ, జేవి రమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్థానిక సిఐటియు కార్యాలయం నందు సిఐటియుమండల స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూఎన్నికలకు ముందు కూటమిప్రభుత్వం అన్ని రంగాల కార్మికులకు, స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని,ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్న కార్మికులందరికీ పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.అధికారులు పనిచేయించుకోవడమే కానీ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు తదితర డిమాండ్ల సాధనకై ఈనెల 30, 31న, జరిగే కలెక్టరేట్ల ధర్నాలలో కార్మికులందరూ పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలను విడుదల చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా మండల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, విజయ, దినా, సరస్వతి, చంద్రకళ, ట్రాన్స్పోర్ట్ రంగం నాయకులు ఎస్,రఫీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మేకల బాబు, ముకుంద, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు ఖాదర్ భాష, సివిల్ సప్లై యూనియన్ అధ్యక్షుడు దాసరి బాలు, మున్సిపల్ స్కూల్ ఆయాల సంఘం నాయకులు చౌడమ్మ, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు