Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయంతకైచీని తిరిగి ప్రధానిగా నియమించిన జపాన్ దిగువ సభ

తకైచీని తిరిగి ప్రధానిగా నియమించిన జపాన్ దిగువ సభ

- Advertisement -

టోక్యో: ఇటీవల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన పదిరోజుల తర్వాత జపాన్ దిగువ సభ బుధవారం సనే తకైచీని ప్రధానమంత్రిగా తిరిగి నియమించింది. సనేతకైచీ గత అక్టోబర్‌లో జపాన్ మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మూడు నెలల అనంతరం వచ్చిన ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఫిబ్రవరి 8న జపాన్ పార్లమెంట్ దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని తకైచీ నేతృత్వంలోని పాలక సంప్రదాయవాద సంకీర్ణానికి మూడింట రెండువంతుల మెజారిటీ లభించింది. తమ భూభాగాలు, జలాల భద్రతకు మద్దతుగా జపాన్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తామని, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తామని ఆమె ప్రతిన బూనారు. జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో అత్యంత శక్తివంతమైన దిగువ సభలో మూడింట రెండు వంతుల సూపర్ మెజారిటీని ఉపయోగించుకోవాలని చూస్తున్నందున, తన పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీని మరింత బలోపేతం చేయాలని తకైచీ భావిస్తున్నారు. ఆమె లక్ష్యాలలో సైనిక శక్తిని పెంచడం, సాంప్రదాయిక సామాజిక విధానాలను బలోపేతం చేయడం వంటివి ఉన్నాయి. దిగువ సభలో మూడింట రెండు వంతుల నియంత్రణ కలిగి ఉండటం వల్ల తకైచీ పార్టీ హౌస్ కమిటీలలో అగ్ర పదవులను చేపట్టడానికి, ఎల్‌డీపీ నేతత్వంలోని పాలక సంకీర్ణానికి మెజారిటీ లేని ఎగువ సభ తిరస్కరించిన బిల్లులను ఆమోదించడానికి వీలు కల్పిస్తుంది. జపాన్ సైనిక సామర్థ్యాన్ని, ఆయుధ అమ్మకాలను బలోపేతం చేయాలని, వలస విధానాలను కఠినతరం చేయాలని, పురుషులకు మాత్రమే సామ్రాజ్య వారసత్వ నియమాలను ప్రవేశపెట్టాలని తకైచీ కోరుకుంటున్నారు. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న జనాభా, సైనిక భద్రతపై ఆందోళనలను ఎదుర్కోవాల్సిన ఒత్తిడి కారణంగా అమెరికా రూపొందించిన యుద్ధానంతర శాంతివాద రాజ్యాంగాన్ని సవరించాలనే ఆమె ఆశయం నెరవేరడానికి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు