Homeఆంధ్రప్రదేశ్ధర్మవరంలో బ్యాంకింగ్ ఉచిత శిక్షణ అర్హత పరీక్షలు విజయవంతం

ధర్మవరంలో బ్యాంకింగ్ ఉచిత శిక్షణ అర్హత పరీక్షలు విజయవంతం

- Advertisement -

ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం; యువత తమ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేంతవరకు విశ్రమించకూడదని ఉపాధ్యాయ సంఘాల గౌరవ సలహాదారు, సంస్కృతి సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ కే.హెచ్. డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన పురస్కరించుకుని, సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ (నంద్యాల) సహకారంతో 120 మంది విద్యార్థులకు బ్యాంకింగ్ ఉచిత శిక్షణ అర్హత పరీక్షలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, జాతి నిర్మాణంలో యువత కీలక పాత్ర వహించాలన్నారు. అపజయం ఎదురైన సందర్భాల్లో నిరుత్సాహపడకుండా, మేధావుల చరిత్రను అధ్యయనం చేసి ప్రేరణ పొందాలని సూచించారు. తరువాత అర్హత పరీక్షలో పాల్గొన్న విద్యార్థినులకు ప్రవేశ పత్రాలను పంపిణీ చేశారు. ప్రతిభా ఆధారంగా అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారిని నంద్యాలలోని గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రవేశ పత్రాలు త్వరలోనే అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేష్, పట్టణ అధ్యక్షులు చంద్ర, రూరల్ అధ్యక్షులు చంద్ర, ఉట్ల నరేంద్ర, కళాశాల సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు