Homeక్రీడలునా పదవీకాలం పొడిగించండి

నా పదవీకాలం పొడిగించండి

- Advertisement -

బీసీసీఐకి అజిత్ అగార్కర్ విన్నపం

న్యూదిల్లీ: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు తెలిసింది. పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ లేదా అగార్కర్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇప్పటికే ఐపీఎల్ 2025కు ముందు అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను మరో ఏడాది పాటు బీసీసీఐ పొడిగించింది. భారత్ 2024 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అతని పాత్రను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 విజయం అనంతరం అగార్కర్ తన అభ్యర్థనను బీసీసీఐ ముందుంచినట్లు తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు