Homeవిశ్లేషణనిరసన హక్కును కాలరాస్తున్న కేంద్రం

నిరసన హక్కును కాలరాస్తున్న కేంద్రం

- Advertisement -

అరుణ్ శ్రీవాస్తవ

భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ఇప్పుడు కొన్ని వ్యవస్థలు కాలరాస్తున్నాయి. నిరసన తెలిపే హక్కుకు రాజ్యాంగపరమైన ప్రాధాన్యం, నైతిక విలువ క్రమంగా తగ్గిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఉదాహరణ ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో 18 రోజులుగా జంతరమంతర్ దగ్గర పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడ¦ం లేదు. చర్చలకు రావడం లేదు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాంగ్‌చుక్ ఇలా దీక్ష చేయడం లేదు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకై ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయింది. తల్లితండ్రులు, కుటుంబాలు ఆస్తులు అమ్ముకుని చదివించి ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నందుకు వారి తరఫున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిరసనపై మౌనం పాటించడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో పాటు ఆన్స్క్రీన్ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు సీజేపీ నిరసనకారులు. పేపర్ లీక్‌తో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. 2026 జూలై 20న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున పార్లమెంట్ వరకు భారీ మార్Ì నిర్వహించనున్నట్లు నిరసనకారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీజేపీ ప్రధానికి బహిరంగ లేఖ కూడా రాశారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఉద్యమానికి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం‌ఎల్) వంటి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా తొలగిస్తే అది అంతర్జాతీయంగా భారత ప్రజాస్వామ్య ప్రతిష్ఠకు మాయని మచ్చగా మిగులుతుందని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే తాను దీక్ష చేస్తున్నానని విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య నిరసనల పట్ల చూపుతున్న వైఖరిని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ప్రమాదకరమైన రాజకీయ వైఖరిని అవలంబిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని అర్థం చేసుకుని వారి గొంతు వినడానికి ఆయన సిద్ధంగా లేరని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీజేపీ సంప్రదాయ రాజకీయ పార్టీ కాదని, నిరుద్యోగం, పాలనపై యువతలో పెరుగుతున్న నిరాశకు ప్రతీకగా స్వయంగా ఉద్భవించిన ఉద్యమం. దీనిని కేవలం సోషల్ మీడియా ట్రెండ్ అని కొట్టిపారేస్తే మోదీ పెద్ద రాజకీయ పొరపాటు చేసినట్లే. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లలో యువత చేపట్టిన ఉద్యమాల మాదిరిగా ఇది కూడా దీర్ఘకాలిక ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంది.
సీజేపీ ప్రభావాన్ని సంప్రదాయ రాజకీయ కోణంలో అంచనా వేయకూడదు. రాజకీయ వ్యూహాలకు అతీతంగా ప్రభుత్వం ఈ ఉద్యమంపై స్పందించాలి. గాంధేయవాద సిద్ధాంతాలను అనుసరిస్తున్న వాంగ్‌చుక్‌తో ప్రధానమంత్రి చర్చలు జరిపి, ఆయన డిమాండ్లపై హామీ ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే ప్రజాస్వామ్య నిరసనలు నిర్లక్షాయూనికి, అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 12 ఏళ్ల పాలనలో తనను తానూ ప్రపంచం ముందు బలమైన నాయకుడు అంటూ చూపించుకున్న మోదీ ఇప్పుడు నిరసనకారులతో చర్చలు జరిపితే ప్రజలు దీన్ని లొంగుబాటు చర్యగా భావించే అవకాశం ఉందని తప్పు చేశామని ఒప్పుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతోనే చర్చలు జరపడానికి ముందుకు రావట్లేదా అనే అనుమానం కూడా బలపడుతోంది. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఎదుర్కుంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ప్రకారం ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ ప్రభుత్వం పోలీసు చర్యల ద్వారా, ఇంటర్నెట్ నిలిపివేతలు, ముందస్తు నిర్బంధాలు వంటి చర్యల ద్వారా అణచివేస్తోంది. దీని కారణంగా ప్రజాస్వామ్య నిరసనలకు స్థలం కూడా దొరకడం లేదు పౌరులు కూడా స్వేచ్ఛగా తమ గళం వినిపించే అవకాశం కూడా కనిపించడం లేదు అంటూ అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలు, పౌరహక్కుల సంఘాలు ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. వాంగ్‌చుక్ చేపట్టిన నైతిక, రాజకీయ నిరసన పట్ల ప్రధాని స్పందించకపోవడం మితవాద రాజకీయ శక్తుల లక్షణమే .
ఇదే తరహా పరిణామం పశ్చిమ బెంగాల్‌లో కూడా కనిపించింది. అంటే జూన్ 29, 2026న అక్కడ ప్రభుత్వం “యాంటీ గూండా” పేరుతో రెండు చట్టాలను తీసుకువచ్చింది. అవి పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ బిల్లు, 2026 , పశ్చిమ బెంగాల్ మెయింటెనెన్స్‌ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (సవరణ) బిల్లు, 2026. ప్రస్తుతం మోదీ రాజ్యంలో ప్రజాస్వామ్య నిరసనల ప్రాధాన్యం తగ్గిపోయింది. విభేదాలను వ్యక్తం చేసే ప్రజాస్వామ్య స్థలం కుదించేశారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు, రైతుల దీర్ఘకాలిక ఆందోళనలు, పరీక్షల అక్రమాలపై సీజేపీ చేపట్టిన నిరసనలు వంటి సందర్భాల్లో ప్రభుత్వం కఠిన పోలీసు చర్యలు, ఇంటర్నెట్ నిలిపివేత, ముందస్తు నిర్బంధం చేపట్టింది . సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దీనివల్ల ప్రజలు ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని విషయం స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశంలో ప్రజాస్వామ్య నిరసన ఇప్పటికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కే అయినప్పటికీ, దాని ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. ప్రజా ఉద్యమాల సమయంలో యూఏపీఏ (ఉపా) వంటి చట్టాల వినియోగం, సామూహిక నిర్బంధాలు, ఇంటర్నెట్ నిలిపివేతలు కార్యకర్తలను అణచివేయడానికి ఉపయోగిస్తున్నారు . వీటన్నింటి కారణంగా భారత ప్రజాస్వామ్యం ఎన్నో ఏళ్ల వెనక్కి వెళ్లిపోతోందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు