Thursday, December 12, 2024
Homeఅంతర్జాతీయంనెతన్యాహుకు మరణదండన విధించాలి

నెతన్యాహుకు మరణదండన విధించాలి

ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ

టెహ్రాన్‌: ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్‌లపై అరెస్ట్‌ వారెంట్‌ ఒక్కటే సరిపోదని… వారికి మరణదండనే తగుననని ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ అన్నారు. సోమవారం బసిజ్‌ పారా మిలటరీ దళాన్ని ఉద్దేశించి మాట్లా డుతూ… ‘‘ఈ నేరగాళ్లకు మరణ దండన విధించాలి. మన శత్రువులు గాజా, లెబనాన్‌లో విజయం సాధించలేరు. ఈ రెండు చోట్లా ప్రజల ఇళ్లపై బాంబులు జారవిడవడం విజయం కాదు. మూర్ఖులు అది ఆలోచించరు. ఎందుకంటే వారు ప్రజల ఇళ్లు, వైద్యశాలలు, కమ్యూనిటీలపై బాంబులు కురిపిస్తున్నారు. వారు చేస్తున్నది నేరం. వారిపై అరెస్టు వారెంట్‌ మాత్రమే జారీ చేశారు. అది సరిపోదు. నెతన్యాహు, గ్యాలెంట్‌కు కచ్చితంగా మరణశిక్ష విధించాలి’’ అని అలీ ఖమేనీ పేర్కొన్నారు. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి వారందరిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. నెతన్యాహు, గ్యాలెంట్‌లు.. గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతోపాటు ఆకలిచావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. అమెరికా సహా వివిధ పశ్చిమ దేశాలు ఈ వారెంట్‌ను అమలు చేయమని తేల్చిచెప్పాయి. తాము నెతన్యాహు పక్షాన ఉంటామని అమెరికా ప్రకటించింది. తాము ఐసీసీ వారెంట్‌ను తిరస్కరిస్తున్నామని ఇజ్రాయిల్‌ వెల్లడిరచింది. ఆ న్యాయస్థానానికి దానిని జారీ చేసే హక్కులేదని పేర్కొంది. తాము గాజాలో ఎటువంటి యుద్ధనేరాలకు పాల్పడలేదని తెలిపింది. మరోవైపు హమాస్‌ నేత ఇబ్రహీమ్‌ అల్‌ మస్రి అలియాస్‌ డెయిఫ్‌పై ‘అక్టోబర్‌ 7’ నాటి మారణకాండకు బాధ్యుడని ఐసీసీ ప్రకటించింది. అతడిపై కూడా వారెంట్‌ జారీ చేసింది.ఆయనను ఇజ్రాయిల్‌ జులైలో హతమార్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు