Homeఆంధ్రప్రదేశ్నెల్లూరు జైలుకు జోగి రమేశ్‌

నెల్లూరు జైలుకు జోగి రమేశ్‌

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కల్తీ మద్యం కేసులో అరెస్ట్‌ అయిన మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును పోలీసులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. న్యాయాధికారి ఈనెల 13 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం జోగి రమేశ్‌, ఆయన సోదరుడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు జోగి సోదరులను ప్రత్యేక ఎస్కార్ట్‌తో మధ్యాహ్నం నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పంపారు. ఈనెల 2వ తేదీన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం లోని ఆయన నివాసంలో సిట్‌ బృందం జోగి రమేశ్‌ను, ఆయన సోదరుడు రామును అరెస్టు చేసింది. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం నెలకొంది. వారిద్దర్నీ విజయవాడ తూర్పు ఎక్సైజ్‌ కార్యాలయానికి తరలించి విచారించారు. అక్కడ గంటల కొద్దీ విచారించారు. పొద్దుపోయాక వారిని విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడకు జోగి రమేశ్‌ కుటుంబీకులు రావడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడిరది. తొలుత జోగి రమేశ్‌ను విజయవాడ జైలుకు తరలించారు. జోగి రమేశ్‌ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించడంపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసులో మిగిలిన వారిపైనా సిట్‌ బృందం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు