వామపక్షాలు, ప్రజాసంఘాల భారీ ప్రదర్శన
విశాలాంధ్రహైదరాబాద్: వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతృత్వంలో ఏర్పడిన పలస్తీనా సంఫీుభావ కమిటీ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని అశోక్ నగర్ నాలా నుండి ఇందిరా పార్కు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శనకారులు ‘అమెరికా సామ్రాజ్య వాదం నశించాలి’, ‘ఇజ్రాయిల్ దురహంకార వైఖరి నశించాలి’, ‘నెతన్యాహును శిక్షించాలి’, ‘పలస్తీనాకు స్వాతంత్య్ర ఇవ్వాలి’ అంటూ నినదించారు. అనంతరం జరిగిన సభలో అజీజ్ పాషా (సీపీఐ), జాన్ వేస్లీ (సీపీఎం), కె. రమసీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్, బి. ప్రదీప్, ఆరెళ్లి కృష్ణసీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, గాదరగోని రవి (ఎంసీపీఐ), మురహరి (ఎస్‌యూసీఐ), అజీజ్‌ఎంపీజే నాయకులు, ఖలీదా పర్వీన్ (జమాతె హింద్), కెేవీఎల్. (ఎ.ఐ పి.ఎస్.ఓ), ప్రొఫెసర్ అన్సారీ, సర్ఫరాజ్ (ఎస్‌ఐఓ), భార్గవి (ఐపీఎస్‌పీ), బోస్ (ఏఐపీఎఫ్) తదితరులు ప్రసంగించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సీపీఎం నాయకులు మహేందర్, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ గ్రేటర్ కార్యదర్శి ఎం. హన్మేశ్, రaాన్సీ`సీపీఐ (ఎం.ఎల్) ఎన్.డి. జిల్లా కార్యదర్శి, అనిల్ కుమార్ (ఎంసీపీఐ), తేజ్ (ఎస్‌యూసీఐ (సి)), విజయ్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఇజ్రాయిల్, పలస్తీనాపై దాడులు చేస్తోందన్నారు. ఇజ్రాయిల్ దేశం ఏర్పడిన 1948 నుండే కక్షపూరితంగా, అమెరికా వత్తాసుతో పలస్తీనాపై దాడులూ, యుద్ధాలు చేస్తోందన్నారు. గత 2 సంవత్సరాలుగా 70 వేల మంది పలస్తీనా ప్రజల్ని హత్యగావించారన్నారు. అందులో సగం పిల్లలు, మహిళలూ, వృద్ధులేనని తెలిపారు. సగటున రోజుకు వంద మంది సామాన్య ప్రజల్ని బలితీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది జర్నలిస్టులను హత్యకు గురవతున్నారన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ పూర్తిగా గజాను ఆక్రమించిందని… 20 లక్షల జనాభాను ఖాళీ చేయించి, రిసార్టు నిర్మిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం దుర్మార్గమని పేర్కొన్నారు. గజాపై దాడులు ఆపాలనీ ముక్తకంఠంతో ప్రపంచం మొత్తం హోరెత్తినా చలించడం లేదన్నారు. ఆహారం, నీరు, ముడి సరుకులు అందుబాటులో లేకుండా చేసి ప్రజలను చంపుతున్నారన్నారు. ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాల ఆహార ట్రక్కులను సరిహద్దుల్లో ఆపడం, వాటి కోసం ఎదురుచూస్తున్న ప్రజల్ని వెంటపడి చంపడాన్ని సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. వెంటనే పలస్తీనాపై దాడులు నిలిపివేసి 145 దేశాలు గుర్తించినట్లుగానే, ఇజ్రాయిల్, అమెరికాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. పలస్తీనా ప్రజలకు హైదరాబాదీల తరఫున సంఫీుభావం ప్రకటిస్తున్నామని ప్రకటించారు. ప్రపంచం గజాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాగర్, డి.జి. నరసింహారావు, అబ్బాస్ (సీపీఎం), ధర్మేంద్ర, వలివుల్లా ఖాద్రి (సీపీఐ), కె. సూర్యం, ఎస్.ఎల్. పద్మ, సదానందం (మాస్ లైన్), జె.వి. చలపతిరావు, అరుణ, అనురాధ (న్యూడెమోక్రసీ), వీక్షణం వేణుగోపాల్, రవిశర్మ, సజయ్, కన్నెగంటి రవి, వినాయక రెడ్డి. పెద్ద సంఖ్యలో వామపక్షాలు, ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.


