ఇజ్రాయిల్, అఫ్గాన్, ఇరాన్, భారత్‌పై ఖాజా ఆసిఫ్ ఆరోపణలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సరిహద్దుల వరకు తమ పట్టు పెంచుకునేలా ఇజ్రాయిల్ కుట్రచేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఆరోపించారు. ఇరాన్‌పై యుద్ధం వెనుక ఉద్దేశం ఇదేనన్నారు. తమ దేశాన్ని సామంత రాజ్యంగా మార్చే ఇజ్రాయిల్ కుట్రలో అఫ్గాన్, ఇరాన్, భారత్ భాగస్వామ్యం ఉన్నట్లు ఆయన ఎక్స్ మాధ్యమంగా ఆరోపణలు చేశారు. ఒక్కటిగా ఉండాలని… రాజకీయ, మతపరమైన విభేదాలను విడనాడి, విదేశీ శుత్రువుల కుట్రలను తిప్పికొట్టాలని పాకిస్థానీయులకు ఖాజా ఆసిఫ్ పిలుపునిచ్చారు. జియోనిస్ట్ ప్రయోజనాýతోనే ఇరాన్ యుద్ధాన్ని రెచ్చగొట్టినట్లు ఆరోపించారు. ఇజ్రాయిల్ ఆధిపత్యానికి వ్యూహాత్మక అజెండాతో ముందుకెళుతోందన్నారు. ఒప్పందానికి ఇరాన్ మందుకు వచ్చినప్పటికీ… ప్రాదేశిక విస్తరణ లక్ష్యంతో వారిని బలవంతంగా యుద్ధంలోకి దింపిందని ఆసిఫ్ పేర్కొన్నారు. 1948 నుంచి ఇస్లామిక్ ప్రపంచంపై జరిగిన ప్రతి యుద్ధం వెనుక జియోనిస్ట్ సిద్ధాంతం ఉన్నదని వ్యాఖ్యానించారు. ఐక్య లక్ష్యంతో రూపొందిన ఈ అజెండాకు తమ ఇరుగు పొరుగు దేశాలైన అఫ్ఘానిస్థాన్, ఇరాన్, భారత్ సహకారం అందిస్తున్నట్లు ఆరోపించారు. మా సరిహద్దులను బలహీనపర్చి… అన్ని వైపుల నుంచి ముట్టడించి మా దేశాన్ని ఓ సామాంత రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఖాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.
పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర
- Advertisement -
RELATED ARTICLES


