Tuesday, July 15, 2025
Homeతెలంగాణపెట్టుబడుల ఆకర్షణలో ముందంజ

పెట్టుబడుల ఆకర్షణలో ముందంజ

. ప్రభుత్వాలు మారినా పాలసీలు అవే
. డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
. ‘మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ’ ప్రారంభోత్సవంలో రేవంత్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ -2047 విజన్‌ డాక్యుమెంట్‌ డిసెంబరు తొమ్మిదిన ఆవిష్కరించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడిరచారు. మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణపై నమ్మకం ఉంచిన మలబార్‌ గ్రూప్‌నకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మహేశ్వరంలో ఫోర్త్‌ సిటీ భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మించబోతున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదన్నారు. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణలో తయారీ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉందని… తొమ్మిది శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని చెప్పారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌, నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీ-2025ను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4,200 దరఖాస్తులు వచ్చాయన్నారు. 15 రోజుల్లోనే 98 శాతం దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తీర్చి దిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. తెలంగాణ తయారీ రంగం గ్రాస్‌ వాల్యుయేటెడ్‌ (జీవీఏ) 2022-23 లో రూ.1.34 లక్షల కోట్లు ఉండగా… 2023-24 లో రూ.1.46 లక్షల కోట్లకు చేరింద న్నారు. జీఎస్డీపీిలో తయారీ రంగం వాటా 19.5 శాతం అయితే … జాతీయ స్థాయిలో 17.7 శాతం మాత్రమే ఉందన్నారు. 2023-24లో ఎగుమతులు రూ.1.2 లక్షల కోట్ల మార్క్‌ ను దాటాయన్నారు. ఐటీ, ఫార్మా తదితర రంగాల మాదిరిగానే తయారీ రంగంలోనూ ‘తెలంగాణను హబ్‌’ గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేస్తున్నాం. సింగిల్‌ విండో సిస్టమ్‌ ‘టీజీ- ఐపాస్‌’ ద్వారా 4200 యూనిట్లకు అనుమతులు మంజూరు చేశామని వివరించారు. వీటిలో 98 శాతం యూని ట్లకు 15 రోజుల్లోనే అనుమతులిచ్చామన్నారు. ప్రస్తుతం పార దర్శకంగా అనుమతులు మంజూరు చేసేలా టీజీ-ఐపాస్‌ ను ఏఐతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన ‘తెలంగాణ’తో చేతులు కలపాలని మరోసారి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఫర్నీచర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు రావాలని, అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే… ప్రతిభ గల తెలంగాణ యువతకు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వంతో చేతులు కలపాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు