Homeతెలంగాణపేదలందరికీ గృహవసతినా బాధ్యత: కూనంనేని

పేదలందరికీ గృహవసతినా బాధ్యత: కూనంనేని

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: నియోజకవర్గంలో పేదలందరికీ గృహ వసతి కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన తమ ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే దళితవాడ కుటుంబాల కష్టాలను తీర్చేందుకు విశేషంగా కృషిచేసి గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పాత కొత్తగూడెంలో 26 దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దళిత కుటుం బాల దయనీయ పరిస్థితిని బీఆర్‌ఎస్‌ పాలకులు గుర్తించకపోవడం బాధాకరమ న్నారు. సొంతిల్లు నిర్మించి పేదలకు సామాజిక గౌరవాన్ని పెంచే దిశగా నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయించే బాధ్యత అధికారులు తీసుకోవాలని కోరారు. బిల్లులు త్వరితగతిన జమచేయించాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌ పాషా, కమిషనర్‌ సుజాత, కంచర్ల జమలయ్య, నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌ రావు, కోడి మల్లేష్‌, రామారావు, గడ్డం వెంకటేశ్వర్లు, బోయిన విజయ్‌ కుమార్‌, సత్యనారాయణాచారి, భవాని, రవికుమార్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు