Friday, March 6, 2026
Homeజాతీయంప్రగతిశీల శక్తుల ఐక్యతకు దోహదం

ప్రగతిశీల శక్తుల ఐక్యతకు దోహదం

- Advertisement -

న్యూదిల్లీ: మార్క్సిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తమిళనాడులోని లౌకిక ప్రగతిశీల ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక కతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై, ఎగ్మోర్‌లో కొన్నెమరా ప్రజా గ్రంథాలయంలో మార్క్స్ విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆవిష్కరించారు. దీనిని స్వాగతిస్తూ… ఈ చర్య ప్రగతి శీలశక్తుల ఐక్యతకు దోహదమని డి.రాజా అన్నారు. మానవ చరిత్రలోని మహనీయులను గౌరవించే అర్థవంతమైన చర్యగా మెచ్చుకున్నారు. కారల్ మార్క్స్ జీవితం, పని… ప్రపంచ చరిత్రకు కొత్త రూపమిచ్చిందని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీపై ఆయన విశ్వేషణ నేటికీ మార్గదర్శకత్వం అందిస్తున్న ట్లు వెల్లడించారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు, కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు, సమ సమాజానికి, ప్రజాస్వామ్యం, మానవులకు గౌరవ జీవితానికి మార్క్స్ ఆలోచనలు, విజన్ దోహదపడుతూనే ఉన్నాయన్నారు. సామాజిక రుగ్మతలు, వలసవాద దోపిడీ అంతానికి ఎన్నో అధ్యయనాలతో మార్క్స్ సూచించిన పధం అందరికీ ఆచరణీయమని డి.రాజా తెలిపారు. మార్క్సిస్టు సిద్ధాంతకర్త విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, హేతువాద డ్రవిడియన్ ఉద్యమానికి…. మార్క్సిస్టు ఆలోచనకు మధ్య సైద్ధాంతిక సారూపత్యను ప్రతిబింబించిందన్నారు. దోపిడీ, అన్యాయం, మూఢ నమ్మకాలు, అణచివేతను ఈ రెండు తిరస్కరిస్తాయన్నారు. సైద్ధాంతిక సారూపత్యతతో పంచుకునే వారసత్వంలో తమిళనాడు ప్రగతి పథంలో ముందుకెళుతూ సామాజిక న్యాయం, ఆత్మాభిమానం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు డి.రాజా వెల్లడించారు.
అసమానతలు పెరిగి…విభజన జరుగుతున్న నేటి తరుణంలో ప్రజాస్వామ్య`లౌకిక విలువలు బలహీపర్చాలనే ఫాసిస్టు శక్తులు ప్రయత్నాల వేళ కారల్ మార్క్స్ సిద్ధాంతాలు, ఆలోచనలతో ఆర్థిక న్యాయం, మెరుగైన భవిష్యత్ కోసం పోరాటాలకు మార్గదర్శకత్వం లభిస్తుందని డి.రాజా వెల్లడించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆ మహనీయుడికి నివాళి మాత్రమే కాదని… ప్రగతిశీల శక్తుల ఐక్యతకు, సమ్మిళిత సంకల్పాన్ని బలపర్చుకునేందుకు, న్యాయమైన సమ సమాజాన్ని నిర్మించేందుకు దోహదపడుతుందని డి.రాజా అన్నారు. ఇందుకోసం తమిళనాడు ముఖ్యమంత్రికి సీపీఐ తరపున ప్రత్యేక ధన్యవాదులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు