Wednesday, February 18, 2026
Homeజాతీయంప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు

ప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు

- Advertisement -

న్యూదిల్లీ: ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. దీంతో ప్రధాని ప్రసంగించలేదు. మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణె ఆత్మకథలోని కొన్ని అంశలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్ష సభ్యుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. వారి నినాదాలతో సభ అనేకసార్లు వాయిదా పడింది. ప్రధాని మోదీ ప్రసంగించేందుకు కొద్ది సమయం ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ఒక్కసారిగా ప్రధాని సీటు వద్దకు దూసుకెళ్లారు. వర్షా గైక్వాడ్, జ్యోతిమణి తదితరులు ప్రధాని స్థానాన్ని ముట్టడించారు. సరైనదే చేయండి/ధర్మం పాటించండి (డూ వాట్ ఈజ్ రైట్) అన్న పెద్ద బ్యానర్ ప్రదర్శించారు. ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకించారు. ప్రధాని సీటు నుంచి వెనక్కు రావాలంటూ అనేక మంది ఎంపీలు బతిమాలడంతో వారు తమ నిరసన విరమించుకున్నారు. సభాపతి సంధ్యారాయ్ వెంటనే సభను వాయిదా వేశారు. కాగా, మహిళా ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీపై దాడికి యత్నించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఆయన పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ పరిణామం భయానకం. కాంగ్రెస్ అసహనానికి ఇది అద్దంపట్టింది. ఇది కుట్ర ప్రకారమే జరిగింది. మహిళా ఎంపీలు ఒక్కసారిగా ప్రధాని సీటును ముట్టడించారు. కిరెన్ రిజిజు సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిస్థితిని అదుపు చేశారు’ అని మనోజ్ తివారీ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు