Homeవ్యాపారంబౌమా కాన్ఎక్స్‌పోలో టాటా మోటార్స్ అత్యాధునిక అగ్రిగేట్స్‌ పోర్ట్‌ఫోలియో

బౌమా కాన్ఎక్స్‌పోలో టాటా మోటార్స్ అత్యాధునిక అగ్రిగేట్స్‌ పోర్ట్‌ఫోలియో

- Advertisement -

ముంబై: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు, మొబిలిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్ అయిన టాటా మోటార్స్, బౌమా కాన్ఎక్స్‌పో ఇండియా 2026లో అత్యాధునిక అగ్రిగేట్స్‌ సమగ్ర పోర్ట్‌ఫోలియోను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో సీపీసీబీ 4 ప్లస్ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 4 ప్లస్) ప్రమాణాలకు అనుగుణంగా 10 కేవీఏ నుండి 125 కేవీఏ వరకు టాటా మోటార్స్ జెన్సెట్లు, 0.7ఎల్ నుండి 3.3ఎల్ వరకు అధిక పనితీరు గల పారిశ్రామిక ఇంజన్లు, అధిక స్థానిక భాగాలతో భారతదేశపు మొట్టమొదటి హబ్‌ రిడక్షన్ యాకిస్ల్ అయిన హెచ్‌ఆర్ 210 లైవ్ యాకిస్ల్ ఉన్నాయి. మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ పరికరాలు, పారిశ్రామిక అనువర్తనాలు, లాజిస్టిక్స్‌ విభాగాల నిరంతరం మారుతున్న అవసరాలను తీర్చడానికి ఈ పరిష్కారాలు రూపొందాయి. క్లిష్టమైన నిర్మాణ వాతావరణాలలో విశ్వసనీయత, అధిక సామర్థ్యం, మన్నిక కోసం వీటిని ఇంజనీరింగ్ చేశారు. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌, పార్ట్స్‌ అండ్ అగ్రిగేట్స్‌ బిజినెస్ హెడ్ విక్రమ్ అగర్వాల్ మాట్లాడుతూ, “టాటా మోటార్స్ అగ్రిగేట్స్‌ పోర్ట్‌ఫోలియో విస్తృతిని ప్రదర్శించడానికి బామా కాన్ఎక్స్‌పో ఒక ప్రముఖ వేదిక. మేము భారతదేశంలో ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ సామర్థ్యాలను నిర్మించామని, అత్యంత క్లిష్టమైన ఆపరేటింగ్ పరిస్థితులలో పని చేయడానికి భారతదేశంలోనే ఇంజన్లు, జెన్సెట్లు, యాకిస్ల్స్‌ రూపొందాయని తెలిపారు. పరిశ్రమ నిరంతర, అధిక`తీవ్రత గల ప్రాజెక్ట్ సైకిల్స్‌ వైపు మళ్లుతున్నందున, మా వినియోగదారులకు వారు ఆధారపడగల పరిష్కారాలు అవసరం. మా అగ్రిగేట్స్‌ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం, వివిధ అనువర్తనాలలో మా ఉనికిని విస్తరించడం, మెరుగైన సామర్థ్యంతో సురక్షితమైన ఉత్పత్తులను అందించడంపై మా దృష్టి ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు