Homeఅంతర్జాతీయంభారత్‌తో బంధం దృఢమైంది

భారత్‌తో బంధం దృఢమైంది

- Advertisement -

ప్రపంచ దేశాల శుభాకాంక్షలు
ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా, సింగపూర్‌, మాల్దీవుల నుంచి సందేశాలు అందాయి. భారత్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని ఆయా దేశాధినేతలు, మంత్రులు పేర్కొన్నారు. ‘79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా నిర్వహించుకుంటున్న భారత ప్రజలకు అమెరికా ప్రజల తరపున శుభాకాంక్షలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌… ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యమైన అమెరికా మధ్య చారిత్రాత్మక సంబంధం కొనసాగుతోంది. భారత్‌, అమెరికా సంబంధాలు ఎంతో దృఢమైనవి. రెండుదేశాలు మరింత శక్తిమంతమైన ఒప్పందాలు చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ‘భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. న్యూదిల్లీ సామాజిక-ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, ఇతర రంగాలలో విజయాన్ని సాధిస్తూ… వేగవంతంగా ముందుకు సాగుతోంది. ప్రపంచ వేదికపై తగిన గౌరవం పొందుతోంది. అంతర్జాతీయ అజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత్‌తో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నాం. మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బహుళ రంగాలలో నిర్మాణాత్మక, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ‘భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఉన్న స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’ అని ఇజ్రాయిల్‌ రాయబారి పేర్కొన్నారు. ‘భారత ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. న్యూదిల్లీ మాల్దీవులకు ఎల్లప్పుడూ విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా ఉంటుంది. రెండుదేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం’ అనిమాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చెప్పారు.
‘భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వారం ప్రారంభంలో న్యూదిల్లీతో జరిపిన చర్చలు రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. మరిన్ని దౌత్య సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాం’ అని సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు