Homeసినిమా’మహాప్రభు జగన్నాథ్’ యానిమేషన్ టైలర్ ఆవిష్కరణ

’మహాప్రభు జగన్నాథ్’ యానిమేషన్ టైలర్ ఆవిష్కరణ

- Advertisement -

హైదరాబాద్: అచంచలమైన భక్తి, అత్యాధునిక సినిమా కళల అద్భుత మేళవింపుతో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ‘మహాప్రభు జగన్నాథ్’ అధికారిక టైలర్‌ను ఇంద్రేష్ ఉపాధ్యాయ మహారాజ్ జీ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఒడిశాలోని కటక్‌లో ఆయన నిర్వహిస్తున్న శ్రీమద్ భాగవత కథ సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ టైలర్‌ను 10,000 మందికి పైగా భక్తుల ముందు ప్రదర్శించారు. భారతదేశంలో ఇప్పటివరకు ఓ యానిమేషన్ చిత్ర టైలర్ ఆవిష్కరణను ఇంతమంది సమక్షంలో చేయటం ఇదే తొలిసారి. జగన్నాథునిపై రూపొందించిన మొట్టమొదటి పాన్ఇండియా యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా ‘మహాప్రభు జగన్నాథ్’, ప్రాచీన వారసత్వాన్ని పిల్లలకు ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ప్రపంచ స్థాయి యానిమేషన్‌ను ఉపయోగించుకుంది. నిర్మాత, ఏలే యానిమేషన్స్‌ పైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు దుర్‌గా ప్రసాద్ దలై మాట్లాడుతూ “మా టైలర్ చూస్తున్నంత సేపూ పదివేల హృదయాలు భక్తితో స్పందించడాన్ని చూడటం మాటల్లో వర్ణించలేని అనుభవం కలిగించిందన్నారు. పోగో ఛానల్ టీవీ సిరీస్ ‘జై జగన్నాథ్’ సాధించిన అఖండ విజయం స్ఫూర్తితో, ఈ ప్రతిష్టాత్మక పాన్ఇండియా చిత్రంను ఎలె యానిమేషన్స్‌ పైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై దుర్‌గా ప్రసాద్ దలై నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీపద్ వార్ఖేడక్కర్. స్క్రీన్ప్లే, సంభాషణలను పల్లవి శర్మ అందించగా, ఒక దైవిక స్పర్శను జోడిస్తూ అవిరల్ కుమార్ సంగీతాన్ని అందించారు. దేశవ్యాప్తంగా ‘మహాప్రభు జగన్నాథ్’ చిత్రం హిందీ, ఒడియా, తెలుగు భాషలలో జూలై 10న సినిమా హాళ్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు