Thursday, January 15, 2026
Homeసంపాదకీయం‘మహా ఐక్యత’ అనివార్యం!

‘మహా ఐక్యత’ అనివార్యం!

- Advertisement -

పడని పొత్తులు, తెగని పంపకాలు, పడతెగని హామీల వానలో బీహార్‌ పన్నికల పోరు జోరెక్కింది. ఇంకొన్ని గంటల్లో నామినేషన్ల పర్వం ముగియనుండగా, సీట్ల కొట్లాట్లతోనే రాత్రింబవళ్లన్నీ గడిచిపోయాయి. బలమైన పన్‌డీఏ ఒకవైపు, తేలని పొత్తులతో బలహీనపడిన మహాఘట్బంధన్‌ మరోవైపు యుద్ధానికి సిద్ధపడగా, ప్రశాంత్‌ కిశోర్‌ వంటి శక్తులు ఏదో ఒక మాయచేసే పనిలో మల్లగుల్లాలు పడుతు న్నాయి. అంతులేని వాగ్ధానాలు బీద బీహార్‌ ప్రజలను ఊరిస్తున్నాయి. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన ప్రజల సమస్యలను పట్టించుకునే పార్టీలు మాత్రం అరకొరగానే కన్పిస్తున్నాయి. బీహార్‌ శాసనసభ పన్నికలు వచ్చే నవంబరు 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. పన్నికలు జరగబోయే 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 38 స్థానాలను పస్సీలకు, 2 స్థానాలను పస్టీలకు కేటాయించారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 7,43,55,976 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండగా, అందులో మహిళా ఓటర్లే 3.50 కోట్ల మంది ఉండటం విశేషం. అయితే ఇప్పుడిప్పుడే ఓటుహక్కు లభించిన 18`19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 14,01,150 మంది ఉన్నారు. అన్ని పార్టీలూ, కూటములు ఈ యువతరం ఓటుపైనే దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలోనే పక్షాల హామీల వెల్లువ బీహార్‌ను ముంచెత్తుతోంది. పన్‌డీఏ సీట్ల పంపకం పన్ని గొడవలొచ్చినా చివరకు సజావుగానే పూర్తయిందని చెప్పుకుంది. ఈ కూటమిలోని ప్రధాన పక్షాలైన బీజేపీ, జేడీ(jూ) చెరొక 101 సీట్లలో పోటీ చేయనుండగా, జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌) 29 స్థానాల్లోనూ, హిందూస్థానీ అవామీ మోర్చా (సెక్యులర్‌), రాష్ట్రీయ లోక్‌మోర్చా చెరి ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పన్‌డీఏ కూటమిలో బీజేపీ తొలిసారిగా బెదిరించి మరీ పైచేయి సాధించింది. నితీశ్‌ కుమార్‌ జేడీ(jూ) 2020 నాటి సీనియారిటీ హోదాను ఈసారి కోల్పోయింది. జేడీ(jూ)తో సమానంగా సీట్లను చేజిక్కించుకున్న బీజేపీ పంతో నమ్మకంతో పన్నికల బరిలోకి దూకింది. వెనుకబడిన కులాల ప్రతినిధిగా చెప్పుకుంటున్న నితీశ్‌పై నమ్మకం ఉంచుతూనే, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి పన్‌డీఏ విజయం సాధించినా, అతన్ని మళ్లీ సీపంగా కొనసాగించా లన్న ఆలోచనైతే బీజేపీకి ఉన్నట్లు కన్పించడం లేదు. ఇక మహాఘట్బంధన్‌లో ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(పం), సీపీఐ (పంపల్‌)తోపాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల్లో సీనియర్‌ పార్టీ ఏదో తేలక, నాయకుల వైరుధ్య ప్రకటనలతో ఆఖరి నిమిషం వరకూ పటూతేల్చక కొట్టుమిట్టాడుతున్నట్లుగా కన్పిస్తున్నాయి. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య కుదరని ఏకాభిప్రాయం ప్రత్యర్థి పార్టీని బాహుబలిని చేస్తున్నది. పన్‌డీఏ అరాచకపాలనకు తెరదించే మంచి అవకాశాన్ని ఈ రెండూ చేజార్చుకుంటున్నాయి. ఓటర్ల జాబితా స్కామ్‌తో భ్రష్టుపట్టిపోయిన పన్‌డీఏను ఐక్యంగా ఓడిరచాల్సిన మహాఘట్బంధన్‌ సీట్ల పంపకం దగ్గరకొచ్చేసరికి నేలవిడిచిసాము చేస్తున్నది. సీట్ల విషయంలో ఓవైపు కాంగ్రెస్‌తో దెబ్బలాడుతున్న ఆర్‌జేడీ మరోవైపు అంతర్గతంగానూ కుమ్ములాడుతోంది. సీట్లు కుదరక చివరకు జేపంపం పోటీ నుంచి తప్పుకోవడం మరో దెబ్బ. వామపక్ష ఉద్యమానికి బలంగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ పోటీచేయాలని ఉర్రూతలూగడం ఓట్ల చీలికకు కారణభూతమవు తున్నది. పక్కువ సీట్లను గెల్చుకుంటానని బీరాలు పలుకుతున్న ప్రశాంత్‌ కిశోర్‌ పన్‌డీఏ బెదిరింపుల కారణంగా కొంతమంది అభ్యర్థులను ఉపసంహరించుకు న్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు పోతున్నది. కుల ప్రాతిపదికగా సామాజిక ‘నిర్వహణ’ చేస్తూనే, యువకులు, మహిళలు, రైతులు, సీనియర్‌ సిటిజన్ల ఓట్లను కొల్లగొట్టేందుకు పకడ్బందీగా, వేర్వేరు ప్యాకేజీలతో ప్రచారం చేపట్టింది. ఆర్థిక వనరులు ఉన్నా, లేకపోయినా, కులాలవారీగా సంక్షేమ పథకాలను ప్రకటించడంలో ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. మహిళలు వ్యాపారం చేసుకోవడానికి రూ.10 వేల చొప్పున ఇస్తామని చెప్పిన బీజేపీ… సంక్షేమం పేరుతో ఓట్ల కొనుగోలును అధికారికంగానే ప్రకటించేసింది. ఈ పథకంతో వూడోవంతు మహిళా ఓటర్లు బీజేపీ పక్షాన నిలబడతారన్న ఆశాభావంతో ఆ పార్టీ ఉంది. ఇంతకుమించిన ప్రయోజనాలతో పథకాలను ప్రకటించిన ఆర్‌జేడీ ఇంకా సీట్ల కొట్లాటలోనే మునిగిపోయి, ప్రచారంలో వెనుకబడిన మాట వాస్తవం. 1950 జనవరి 26న బీహార్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికసార్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ, జనక్రాంతిదళ్‌ (1967), శోషిత్‌దళ్‌ (1968), సోషలిస్టుపార్టీ (1970), జనతాపార్టీ (1977) కాంగ్రెస్‌ అధికారానికి విరామాలు తీసుకువచ్చాయి. అనంతరం 1990లో లాలూప్రసాద్‌ యాదవ్‌ సారథ్యంలోని జనతాదళ్‌, ఆ తర్వాత ఆయన నాయకత్వంలోనే రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆరేజేడీ) కాంగ్రెస్‌ కుంభస్థలాన్ని కొట్టిపడేసింది. పటొచ్చీ జేడీ(jూ) అరంగేట్రమయ్యాక, ఆ పార్టీ నేత నితీశ్‌ కుమార్‌ తొలుత jూపీఏతోనూ, ఆ తర్వాత పన్‌డీఏతో కుప్పిగంతులాటలతో బీహార్‌ ప్రజలను ఏమార్చి అటుఇటుగా నాలుగుసార్లు సీపంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఐదోసారి బీహార్‌ ప్రజలను మోసం చేయడానికి అన్ని విధాలా రంగం సిద్ధం చేసుకున్నారని తేజస్వియాదవ్‌ లాంటి వారు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నప్పటికీ, నితీశ్‌ను ఓడిరచే క్రమంలో ఐక్య పోరాటంలో సాగుతున్న వైఫల్యాన్ని కాదనలేం. 20 ఏళ్లుగా నితీశ్‌ అధికారంలో ఉన్నా, బీహారీల అసలు సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు.
బీహార్‌ ప్రజలు పదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పేదరికం ఒకటి. నీతి ఆయోగ్‌ నివేదికల ప్రకారం, బీహార్‌ దేశంలోనే అత్యధిక నిరుపేదలు ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు వంటి అంశా లలో వెనుకబడి ఉంది. అంతులేని ఉపాధి లేమి వెంటాడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. యువతలో నిరుద్యోగుల శాతం పక్కువగా ఉంది. దీని కారణంగానే ఉపాధి కోసం బీహార్‌ ప్రజలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం మరో సమస్య. ఇది పూర్తిగా రాజకీయ పాపమే. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ మందగించింది. జార్ఖండ్‌ విడిపోయిన తర్వాత కూడా పారిశ్రామిక అభివృద్ధి అంతగా జరగలేదు. బీహార్‌లో పారిశ్రామికాభివృద్ధికి భూమి కొరతే ప్రధాన అడ్డంకిగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిన్నకాకమొన్న సెలవిచ్చారు. 20 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత కూడా హోంమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి సాకులు చెప్పడం విడ్డూరం. ఇక వ్యవసాయవూ ఒక సమస్యే. వ్యవసాయం చాలావరకు ప్రకృతి వైపరీత్యాలపై ఆధారపడి ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే వరదలు (ముఖ్యంగా ఉత్తర బీహార్‌లో), కరువులు (దక్షిణ బీహార్‌లో) వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. వ్యవసాయ పద్ధతుల్లో ఆధుని కీకరణ లేకపోవడం కూడా ఒక సమస్య. తక్కువ అక్షరాస్యత, విద్య ప్రజలను పురోగమనం దిశగా నడిపించలేకపోతున్నాయి. అక్షరాస్యత శాతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉండటం బాధాకరం. మౌలిక సదుపాయాల కొరత పట్టిపీడిస్తున్నది. రోడ్లు, ఇతర రవాణా వ్యవస్థల అభివృద్ధిలో ఇంకా వెనుకబాటుతనమే. ఈ పాపం ఫక్తు బీజేపీదే. కుల రాజకీయాలు, సామాజిక విభజన ఈ రాష్ట్రంలో సహజసిద్ధమైన లక్షణాలు. కులాలు, మతాల వారీగా చీలిపోయిన సమాజం, రాజకీయాలు సామాజిక సంస్కరణలు, అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నాయి. వీటిని అడ్డంపెట్టుకొని, నితీశ్‌ వంటి బీసీని పావుగా వాడుకొని కేంద్రం నుంచి బీజేపీ చక్రం తిప్పుతూ నిష్క్రియాపరత్వంతో సగటు బీహారీని దగా చేసింది. అవినీతి, పౌర సేవల్లో ఆలస్యం వంటి పాలనాపరమైన సమస్యలు బీహార్‌ తర్వాతనే ఇంకే రాష్ట్రమైనా. ఈ నేపథ్యంలో బీహారీలు మరోసారి మోసపోకుండా ఉండాలంటే, మహాఘట్బంధన్‌లో ‘మహా ఐక్యత’ అత్యవసరం, అనివార్యం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు