ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడమే లక్ష్యం: ట్రంప్
వాషింగ్టన్: రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్, లుకోయిల్ అనే రెండు పెద్ద చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్ భేటీ వాయిదా నేపథ్యంలో ఈ చర్యలు చర్చకు దారితీశాయి. తాజా ఆంక్షల గురించి యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ ఓ ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించడంతో పాటు శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేనందునే ఆంక్షలు విధించినట్లు వెల్లడిరచింది. చమురు రంగంపై ఒత్తిడి పెంచి రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే తమ ముఖ్య లక్ష్యంగా పేర్కొంది. శాశ్వత శాంతి నెలకొల్పే అంశం పూర్తిగా రష్యా స్పందనపైనే ఆధారపడి ఉందని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడిరచారు. రష్యాను కట్టడి చేయడం కోసం విధించిన ఆంక్షలకు కట్టుబడి ఉండాలని మిత్రదేశాలకు పిలుపునిచ్చారు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు 19 ఆంక్షల ప్యాకేజీని ఈయూ కూడా ఆమోదించింది. రష్యా ఎల్‌ఎన్‌జీని నిషేదించింది. ఉక్రెయిన్‌కు రెండేళ్ల పాటు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కాగా, రష్యాపై ఆంక్షలు ఎక్కువ కాలం ఉండవని, ఈలోగా శాంతి నెలకొంటుందని ట్రంప్ దీమా వ్యక్తంచేశారు.. రష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపించడమే తమ చర్యల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు
- Advertisement -
RELATED ARTICLES


