Wednesday, February 18, 2026
Homeసాహిత్యంవంట-వార్పూ అవార్డులు

వంట-వార్పూ అవార్డులు

- Advertisement -

పేపకాయల ప్రసాద్‌, 9490712967

‘మూను కన్న మొల్ల కన్న/ నీదు మోము బ్రైటట…./టటట టా/టటట టా /టటట టా’ అరమోడ్పు కనులతో పాడుకుంటున్నాడు గిరీశం. పక్కనపెట్టిన చుట్ట నుంచి లేచిన పొగ అక్కడంతా వ్యాపిస్తోంది.
ఏమివాయ్‌ మై డియర్‌ షేక్స్పియర్‌… మొఖం మళ్ళీ వేలవేసినావ్‌… దూరం నుంచి నీరసంగా నడిచివస్తున్న శిష్యుణ్ణి పలకరించాడు గిరీశం.
ఛ… వూరుకోండి గురూగారూ… ఎప్పుడూ అదే పిలుపా! ముఖం వేలవేసే వాడు ఈ ప్రపంచంలో షేక్స్పియర్‌ ఒక్కడేనా ఏంటి…మీరు అప్డేట్‌ అవ్వడం లేదండి… విసుక్కున్నాడు వెంకటేశం.
ఇంతకూ వెళ్లిన పని ఏమైందీ?
ఎంతసేపూ మీ పనులేనా ? నాకూ ఓ పనొచ్చి పడింది. మీరే సాయం చేయాలి…గునిసాడు వెంకటేశం.
ఊ.. మొగమాటం ఎందుకు? ఊదేయ్‌… తలూపాడు గిరీశం.
గురువు మాటను అక్షరాలా పాటిస్తూ ఊదేసాడు వెంకటేశం. అతడి వేళ్ల మధ్య లంక పొగాకు చుట్ట ఎర్రగా కాలుతోంది.
డామిట్‌ యూ బార్బేరియస్‌ ఫెలో…ముక్కు నిండా చుట్ట పొగ పట్టేయటంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అరిచాడు గిరీశం.
‘బొత్తిగా ఇడియట్‌లాగా తయారవుతున్నావేఁ ఊదమన్నది చుట్ట పొగ కాదోయ్‌. విషయం ఏంటో చెప్పమన్నాను…’ తేరుకున్నాక వెంకటేశానికి వివరించాడు.
చెవిలో ఊదేంత రహస్యం ఏవీ లేదులెండి గురూగారూ. రాజధానిలో వంటకాల పోటీలు పెట్తారటండి. మీరు ఉప్మా చైటంలో, పులిహోర కలపటంలో ఎక్‌్సపర్టు కదా… ఆ పట్లు, పాళ్లు నాక్కూడా నేర్పుతారని… బతిమాలుకున్నాడు.
‘పట్లు పుట్టుకతో రావాలోయ్‌. పాట్లు పడినంతమాత్రాన పట్లువచ్చేనా?! ఇక పాళ్లంటావా? చెప్తా కానీ…
ఉప్మా, పులిహోరా ఎందుకు ట్రెడిషనల్‌ రోత..దేశవాళీ ఆలోచనలకు కాలం చెల్లిందోయ్‌.. ఇప్ప్పుడంతా మిక్చర్‌ మేళానే… ఐటమ్‌కి అవసరంపడే ఇన్‌ గ్రీడియెంట్‌్సనే చెప్తా కానీ… ఇంతకూ ప్రైస్‌, ప్రైజ్‌ ఏమేనా వుందా? వట్టి ప్రెయిజ్‌ మాత్రమేనా?
వంటలూ వార్పుల కమిటీ కదా … ప్రైజ్‌ కచ్చితంగా ఉంటుంది గురూ గారూ… ఇప్ప్పుడెలా వుందో తెలియదు కానీ
చాలా యేళ్ల కిందట – పోటీల కోసం నా మిత్రుడు కష్టపడి ఓ డిష్‌ చేసి పట్టుకెళ్తే ప్లేటులో సగం సర్దిన తర్వాత – మిగిలిన దాన్ని అడ్మిట్‌ చేసుకోం… పట్టుకు పొమ్మన్నారండి సెలక్షన్‌ కమిటీ వారు. మా వాడు విపరీతంగా బాధపడిపోయాడనుకోండి… ఇంకొకరినైతే లోపలికే రానీయలేదు… తమ దగ్గర స్టాక్‌ చాలా ఉందని, కొత్తగా మొరమొరాలు, పేలాలతో ప్రిపేర్‌ చేసిన ఐటమ్‌్సనే తీసుకుంటామని – అవి మన సంస్కృతిలో ప్రత్యేకం అనీ అన్నారు!
అదేంటోయ్‌… ముక్కున వేలేసుకున్నాడు గిరీశం…
ఇంకా ఉన్నాయి వింతలు – కొందరినైతే రోజులూ వారాలూ తిప్పించిన తర్వాత రిప్లయ్‌ ఇచ్చేరండి గురూగారూ … మినిమం డాక్టరేట్‌ అయిన వాడి వంటలయితేనే తీసుకుంటాం అని!
గిరీశం అదిరిపడ్డాడు ఆ మాటలు వింటూ …
ఈ మాత్రం దానికే అంత ఎక్‌్సప్రెషన్‌ ఇస్తే ఎలాగ… ఇదీ వినండి మరి…ఆవు నేయిని, పచ్చ కర్పూరాన్ని-ఎక్కువగా ప్రసాదాల్లో వాడతారు గనక వాటితో చేసిన వంటకం – నాన్‌ సెక్యులర్‌ అవుతుందనీ కమిటీ కన్సిడర్‌ చేయదని కూడా అన్నారండి…! మేనేజ్‌మెంట్‌ వాళ్లు పెట్టిన రకరకాల కండీషన్లని భరించి మరీ పదిహేనుమంది ఫైనల్‌దాకా వస్తే- పార్టిసిపెంట్‌్సకి తల తిరిగిపోయే ట్విస్‌్ట ఎదురైంది గురూగారూ…
పోటీదారులు పూర్తిగా తమ వంటకాలు బౌల్‌్సలో సర్దనేలేదు! హాల్లోకి వచ్చి జడ్జీలు చెమ్చాడైనా రుచి చూసిందీ లేదు! బౌల్‌్స మీద ఉన్న మూతలు కూడా తీసి చూడకుండానే టీవీ స్క్రీన్ల మీద ఫలితాలు రావడం చూసి నోట మాట రాలేదనుకోండి.
‘ఇంతకూ – ఆ పోటీలో విన్నర్‌ ఎవరోయ్‌?’ ఆశ్చర్యం నుంచి తేరుకుని ప్రశ్నించాడు గిరీశం.
‘తద్దినం వంటకాల్లా ఘుమఘుమలాడే సూపర్‌ స్పెషల్‌ డిష్షు ‘కమిటీ ప్రైజు గెలుచుకున్నదని-ఆ రెసిపీని నార్‌్త, సౌత్‌ తేడా లేకుండా దేశమంతా హోfల్‌ మేనేజ్మెంట్‌ కోర్సుల్లో సిలబస్‌గా పెడతామని అన్నారండి… తీరా ఆ గొప్ప వంటకం ఏంటా అని చూస్తే అదేదో రోడ్‌ పక్కన బండిమీద తయారైన ఆల్‌మిక్చర్‌ లాగా అనిపించింది!
ఆ రిజల్టుకి తట్టుకోలేక మావాళ్లు ఎంతో కష్టపడి వండిన నలభీమ పాకాల్ని డస్‌్టబిన్‌లో పారేసి పోయారు గురూగారూ…
కమిటీ వారిని పట్లు పట్టేవాళ్ల గుట్లుమట్లూ బాగా తెలిసిన వాళ్లూ – అందునా మా గురువు గారు…మీరొక్కరే కదా నాకు దిక్కు. కండీషన్లు – కామాలూ పెట్టేవాళ్లు డంగై పోయేలాంటి డిష్‌ మీరే నేర్పాలి… బతిమాలాడు వెంకటేశం.
ఓస్‌ అంతే కదా…. వంటలో వాడిన మెటీరియల్‌ ఏంటో కూడా చూడ కుండానే- Hశీw ఱ wశీఅdవతీ wష్ట్రat yశీu aతీవ Uజూ abశీఙవ tష్ట్రవ wశీతీశ్రీd sశీ ష్ట్రఱస్త్రష్ట్ర అంటూ రెచ్చిపోయి పొగిడేసే వాడిచేత నీ పనోడితనంమీద నాల్రోజుల ముందు నుంచే ఎఫ్బీలో పోస్టులు పెట్టించి – సోషల్‌ ప్లాట్‌ ఫారాల్లో భారీగా షేర్లూ, లైకులు కొట్టిద్దాం – ఆ దెబ్బతో కమిటీ దృష్టిలో నువ్వు ఇన్‌స్టంట్‌గా హీరో ఐపోతావ్‌! ఆ తర్వాత కమిటీ అవార్డు ఎలాగూ నీదే …
సరే… అదంతా అలా ఉంచి, కిజిలీ – తయారు చేయటానికి కావలసిన సరుకులు చెప్తా… జాబితా రాసుకో…
‘కిజిలీనా … వింతగా ఉంది. ఎపుడూ వినలేదే!’ ఆశ్చర్యంగా అడిగాడు వెంకటేశం.
వెల్‌ మై డియర్‌ బోయ్‌ … మన కిచిడీని స్విస్‌ మిస్సుల మ్యుజిలీతో అంటుకట్టి నే క్రియేట్‌ చేసిన కొత్త డిష్‌ అది…డౌటు పెట్టుకోకుండా చెప్పినట్టల్లా రాయి.
‘ఇంగువ పావు తులం, ఇమేజరీ రెండు కప్ప్పులు, అరటి దూట అర టీ స్పూను, అల్లిగోరి ఆరుడజన్లు, చింతచిగురు ఓ రెబ్బ, సినక్డకీ చెమ్చాడు, ఐరనీ ఐదుగ్రోసులు, అండర్‌ స్టేట్మెంట్‌ అరకేజీ’ గిరీశం చెప్ప్పుకుంటూ పోతున్నాడు.
‘ఏం వంటకమో ఏంటో … అంతా కన్ఫ్యూజన్‌గా ఉందండి… కొన్ని ఐటమ్‌్స పేర్లే ఎప్ప్పుడూ వినలేదు…వీటితో డిష్‌ ప్రిపేర్‌ చేస్తే కనీసం టేస్‌్ట చేస్తారంటారా?’ ఆశ్చర్యంగా అడిగాడు వెంకటేశం.
టేస్‌్ట చేయకపోవడం ఏంటి నాన్సెన్‌్స… వాళ్ల నాలుక్కి నచ్చితే కమిటీ అవార్డుతో పాటూ వేరే అవార్డులూ రివార్డులూ కూడా రావచ్చు. మన ఐటమ్‌ జడ్జీల పళ్లకింద నలగకపోతే మరీ మంచిది.
పాపయ్య శాస్త్రుల్ల ఉవాచ :‘ దంతపుష్టి లేని తాతయ్య గారికి చెరుకుగడలటన్న చెడ్డమంట’
నమల్లేక పోతున్నాం అని ఒప్పేసుకుంటే నలుగురి యెదటా చిన్నతనం కనక దాన్ని కప్పి పుచ్చుకుందుకు పెద్ద మనుషులు అనగా కమిటీ పీపుల్‌ ఏం చేస్తారు?
అవును ఏం చేస్తారు? అమాయకంగా అడిగాడు వెంకటేశం.
‘వారి వాజమ్మా… మన వంటకంలో ఏదో గొప్పవిశేషం ఉందని నోటికొచ్చిన విశేషణాలేవో పొగిడేసి ఓ బిరుదు ప్రదానం చేసేస్తారు. పరమ పాచక ప్రభూ అనో…బ్రహ్మ పదార్థ విభూ అనో…’ వివరించాడు గిరీశం.
మీరు మరీ డేమేజింగ్‌గా మాట్లాడుతున్నారు గురూగారూ…
నాన్సెన్‌్స… నువు మరీ ఫూల్లాగా వున్నావు… ఇంతసేపూ గమనించలేదు గాని …మూతికి తెల్లగా ఆ పిండేమిటీ… వచ్చేటపుడు ఏమన్నా బొక్కేసావా?
సీతాఫలం తిన్నా గురూ గారూ…
వెల్‌ … ఏదీ వదలకుండా మొత్తం తినేసావటోయ్‌?
లేదండి…తొక్కలు, పిక్కలు వదిలేశాను.
దట్‌్స ఇట్‌… కమిటీ పీపుల్‌ ఆర్‌ టూ ఇంటిలిజెంట్‌్స… వాళ్లూ ఇలాగే అక్కర్లేని వాటి జోలికి పోకుండా తమ పని తాము చూసుకుంటారు…
అలా అయితే ఎవరి మనోభావాలూ దెబ్బతినవు కదా… భయపడుతూ అడిగాడు వెంకటేశం.
మనోభావాలు మట్టి గడ్డలూ అనకు.ఒళ్లు మండుతూంది. ఏం తింటున్నాడో తినే వాడికే అర్ధం కాకుండా తయారు చేయటంలో ఉన్న గొప్ప నీకేం తెలుసు … డెన్మార్‌్క సామెత వినలేదా…డిఫికల్‌్టగా ప్రిపేర్‌ చేసే అవకాశం ఉన్నపుడు ఈజీగా ఎందుకు చేయటం ?
అయినా… వార్చేవాడు – వడ్డించేవాడు మనవాడైతే అవార్డులదేముందీ!
నా మాట విన్నావంటే – కమిటీ అవార్డు విన్‌ అయ్యే సీక్రెట్‌ చెప్తాను… శిష్యుడి చెవి దగ్గర గుసగుసలాడాడు గిరీశం.
వెంకటేశం ముఖం మీద చిన్న నవ్వు నిల్వ చిచ్చుబుడ్డిలాగా ఒక్క క్షణం వెలిగి, ఆ మరుక్షణమే ఆరిపోయింది…
‘డామిట్‌… హాయిగా నవ్వు మై డియర్‌ వెంకటేశా! నవ్వుల మీద ఇంకా జీయెస్టీ వేయలేదుగా’ కసిరాడు గిరీశం..
ఉత్సాహంగా ఈలవేస్తూ ముందుకు సాగిపోయాడు వెంకటేశం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు