Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాసేవకు దక్కిన అరుదైన గౌరవం

సేవకు దక్కిన అరుదైన గౌరవం

- Advertisement -

విశాలాంధ్ర- ఎ కొండూరు

మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు గడ్డి కృష్ణారెడ్డికి జిల్లా ఉత్తమ మార్గదర్శి అవార్డును సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ చేతుల మీదగా ఉత్తమ మార్గదర్శి అవార్డును అందించడం జరిగిందని గడ్డి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోనే కాకుండా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని ఆదరించే గుణం ఉండాలని ఆయన చెప్పారు

కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు ఇతర పారిశ్రామిక వాడల్లో రోజువారి వేతనం పొందే చాలామంది నిరుపేదలు పనిలేకుండా పోవడం కోవిడ్ నిబంధనలు ఉండడంతో వారి రోజువారి జీవనం కూడా అంతంత మాత్రమే సాగింది అటువంటి పరిస్థితుల్లో మండలంలో పలు గ్రామాలలో తనకు చేతనైనంత నిత్యవసరాలను కూరగాయలను అందించడం అంటే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు

ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్నదాంట్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సాయం చేయడం మనిషిగా మన కర్తవ్యం అని ఆయన చెప్పారు

ఈ సందర్భంగాఉత్తమ మార్గదర్శి అవార్డుకు ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ శాఖ ఆయన అభినందనలు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు