గణతంత్ర వేడుకల్లో పుల్లారెడ్డి
విశాలాంధ్రవిజయవాడ: ప్రజలకు అంతరాయంలేని నాణ్యమైన విద్యుత్‌ను అందించి వినియోగదారుల మన్ననలను చూరగొనాలని ఏపిసిపిడిసియల్ సీయండీ పి పుల్లారెడ్డి సూచించారు. సోమవారం కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ అందరి కషితో జాతీయ స్ధాయిలో కార్పొరేషన్ బి గ్రేడ్‌క చేరుకుందని, మరింతగా కష్టపడి ఎ గ్రేడ్ సాధించాలని అభిలాషించారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ ను ఆలస్యం లేకుండా త్వరితగతిన ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి.
అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, ఉద్యోగుకలు ప్రసాంశ పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం లో టెక్నికల్ డైరెక్టర్ ఏ.మురళీ కృష్ణ యాదవ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ టి వి ఎస్ ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, అధికారులు, ఉద్యోగులు పోలీస్ ఇన్స్పెక్టర్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.


