ఎ కొండూరు విశాలాంధ్ర
మండల కేంద్రమైన ఎ కొండూరు మండల పరిషత్ అభివృధి కార్యాలయంలో ఎంపిడిఓ బొజ్జగని శ్రీనివాసరావు తాహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎన్ అరవింద్ అధ్యవరంలో 77 వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఎగుర వేశారు అలానే మండలం పోలీస్ స్టేషన్ లో
స్టేషన్ హౌస్ ఆఫీసర్ గంధం మలక్ష్మణుడు గణతంత్ర వేడుకలు సందర్భంగా స్టేషన్ లో సిబ్బంది తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.. అలానే మండల కేంద్రలో వెలుగు కార్యాలయంలో ఎ. పి. ఎం. యెహోషివ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్
డా. వేముల స్వాతి, జాతీయ ఉపాధి హామీ కార్యాలయలో
ఎ.పి.ఎం అనురాధ, కస్తూరి బా గాంధి విద్యాలయంలో సిబ్బంది మండల విద్య శాఖ కార్యాలయంలో ఎం.ఈ.ఓ ఈ.ఎల్.సి కేశవరావు, ఆశ్రమ పాఠశాలలో, ప్రిన్సిపాల్ లో కవిత
గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో సిబ్బంది వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎ.డి.ఎ రంగారావు, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎ.ఈ పామర్తి నాగరాజు, సిబ్బంది, జిల్లా పరిషత్ పాఠశాలలు మండల పరిషత్ పాఠశాలకు ప్రైవేట్ విద్య సంస్థలు వర్తక వాణిజ్య వ్యాపరులు ఆటో రిక్షా యూనియన్, వివిధ ప్రజా సంఘాలు కార్మిక కర్షక సంఘాలు ఆధ్వర్యంలో 77 వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ను ఎగరవేసి బాల బాలికలకు మిఠాయిలను పంచి జాతీయ గీతాన్ని ఆలపించి గణతంత్రాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అలానే మండలం లోని 21 పంచాయతీలలో సచివాలయాల వద్ద సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి 77వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు


