Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లామహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు

మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు

- Advertisement -


ఎన్టీఆర్ జిల్లా ప్రగతికి సమష్టిగా కృషి

  • అన్ని రంగాల్లోనూ 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యం
  • 77వ గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జి.లక్ష్మీశ
    విశాలాంధ్ర`విజయవాడ: మహనీయుల త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు వేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
    సోమవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో తొలిసారిగా జిల్లాస్థాయి 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించి పోలీస్ దళాలు, వివిధ బందాలు నిర్వహించిన కవాతాను తిలకించారు. కలెక్టర్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వేడుకల్లో జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందరÊభంగా కలెక్టరH మాట్లాడుతూ
    జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ఎందరో మహనీయుల విరోచిత పోరాటాలు, అపురూప త్యాగాల ఫలితంగా స్వతంత్ర భారతావని సిద్ధించిందని, ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తూ భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా సమున్నత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించుకున్నామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ, దేశ పౌరులుగా మన విధులు, బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ సమగ్రత పరిరక్షణ, పురోగతికి జాతి, కుల, మత, ప్రాంత భావనలు లేకుండా మనందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. అందరి సహకారం, భాగస్వామ్యంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి, సర్వజన సంక్షేమానికి కృషిచేద్దామని పేర్కొన్నారు.
    స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు సమిష్టి భాగస్వామ్యంతో ఈ పథకాలు, ప్రణాళికలను మన ఎన్ టీ ఆర్ జిల్లాలో విజయవంతంగా అమలు చేసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు నిర్వహించిన సాంస్కతి కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. వేడుకల్లో 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డీసీపీలు తిరుమలేశ్వర రెడ్డి, లక్ష్మీనారాయణ, కె.జి.వి.సరిత, ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి, కృష్ణ ప్రసన్న, ఎస్.వి.డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

`ఆకట్టుకున్న శకటాలు..
ఈ వేడుకలలో ప్రదర్శించిన మొత్తం 18 శాఖల శకటాలు స్వర్ణాంధ్ర పది సూత్రాల కార్యాచరణను కళ్లకుకట్టాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, స్వర్ణాంధ్ర 2047 , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , పౌరసరఫరాల శాఖ, పర్యాటక శాఖ, పాఠశాల విద్యా,, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఈగల్ టీం, వైద్య ఆరోగ్య , జిల్లా మహిళా శిశు సంక్షేమ, నీటి పారుదల, అటవీ, వ్యవసాయం, పంచాయతీరాజ్ , పశుసంవర్థక, ఉద్యాన, ఏపీ ఎంఐపీ , విజయవాడ నగరపాలక సంస్థ, రవాణా శాఖ, అగ్నిమాపక శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు