Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావైభవంగా గణతంత్ర వేడుకలు

వైభవంగా గణతంత్ర వేడుకలు

- Advertisement -


రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం...

దోనేపూడి శంకర్
విశాలాంధ్రవిజయవాడ: నగరంలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. తొలుత భారత జాతీయ పతాకాన్ని గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు సభ్యులతో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విలువలతో కూడిన రాజ్యాంగ విలువలను లౌకిక వ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు కంకణదారులు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, అత్యంత పురాతన మైన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలను ఔన్నత్యాన్ని కాపాడుకుంటూనే, భిన్న సంస్కృతులకు ఆలవాలమైన భిన్న విభిన్న జాతుల కలయికే భారత ప్రజాస్వామ్యమని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని అన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయమూర్తి బందెల అబ్రహాం హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి సి గడ్డం సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు డోగిపర్తి శంకర్రావు, కోశాధికారి వెలగపూడి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కాగితాల రాజశేఖర్, పిళ్ళా నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్ధులకు బహుమతులు ప్రధానం
వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్ధులకు గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి బందెల అబ్రహాం బహుమతులు ప్రధానం చేశారు. ప్రధమ బహుమతి రూ 10వేలు భవిష్య కళాశాల ఇంటర్ విద్యార్థి నేత్ర, ద్వితీయ బహుమతి రూ 7వేలు సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలకు చెందిన బి స్టాన్లీ శభాష్టియన్, తృతీయ బహుమతి రూ 5వేలు పి. దేవీ కృష్ణప్రియ ,ఏఎం కళాశాలకు చెందిన విద్యార్థి. కేబీఎన్, శారదా జూనియర్, శ్రీ చైతన్య, భవిష్య కళాశాలలకు చెందిన ఆరుగురు విద్యార్ధులు బహుమతులు అందుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న 178 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రం, స్వామి వివేకానంద బోధనలతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. విద్యాసంస్థల అధినేత, బిల్డర్ వెలివర్తి దుర్గాప్రసాద్ రాజు, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అధ్యక్షుడు బచ్చు ప్రసాద్ సౌజన్యంతో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. మహానటి సావిత్రి కళా పీఠం అధ్యక్షులు పరుచూరి విజయలక్ష్మి, సిద్ధార్థ కళాశాల అధ్యాపకులు సత్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు