Homeసంపాదకీయంవాంగ్ చుక్ ప్రాణాలతో చెలగాటం

వాంగ్ చుక్ ప్రాణాలతో చెలగాటం

- Advertisement -

పర్యావరణ పరిరక్షకుడు, సరిహద్దులోని సైనికులు తీవ్రమైన చలితో బాధపడకుండా ప్రత్యేకమైన గుడారాలు నిర్మించిన వాడు అయిన సోనం వాంగ్ చుక్ ఆమరణ నిరా హార దీక్ష గురువారం నాటికి 19వ రోజుకు చేరింది. తన ఆరోగ్యం మరికొన్నాళ్లు నిరాహార దీక్ష కొనసాగించడానికి అనువుగానే ఉంది కనక తాను ఆమరణ దీక్ష విరమించే ప్రసక్తే లేదని వాంగ్ చుక్ అంటున్నారు. జాతీయ అర్హత, సామర్థ్య పరీక్షల నిర్వహణా వ్యవస్థ (నీట్) పరీక్షా పత్రాలు ముందే బయటపడడానికి కారణం అయింది కనక విద్యా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్నది వాంగ్ చుక్ ప్రధానమైన కోరిక. ధర్మేంద్ర ప్రదాన్లో ఇప్పటిదాకా ఎలాంటి చలనమూ కనిపించలేదు. అంటే నీట్ పరీక్షా పత్రం లీక్ అయినందుకు నైతిక బాధ్యత తీసుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. దీని పిండితారœం ఏమిటంటే మొత్తంగా మోదీ ప్రభుత్వమే నైతిక బాధ్యత తీసుకోవడానికి సుముఖంగా లేదు. వాంగ్ చుక్ ప్రాణాలు కాపాడడానికైనా ఆయనతో చర్చలు జరపాలన్న ఉద్దేశమే మోదీ ప్రభుత్వానికి లేదు. అనేక మంది ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రసిద్ధ పత్రికా రచయితలు, సినీరంగ ప్రముఖులు ఆయన దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శిస్తున్నారు. రి
ప్రభుత్వం ఎటూ చలించేట్టు లేదు కనక వాంగ్ చుక్ ఆమరణ దీక్ష విరమించాలని సలహా ఇచ్చారు. అభ్యర్థించారు. కానీ ఆయన ఆమరణ దీక్ష విరమణకు సిద్ధంగా లేరు. ఆయన ప్రాణాలను కాపాడే దృష్టి ప్రభుత్వానికి అంతకన్నా లేదు. వాంగ్ చుక్ చేత దీక్ష మాన్పించేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ ఒక న్యాయవాది దిల్లీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దిల్లీ హైకోర్టు వాంగ్ చుక్ చేత దీక్ష విరమింప చేయాలని ఆదేశం ఏదీ జారీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన సోలిసిటర్ జనరల్ వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజూ బేరీజు వేస్తామని, వైద్యుల సలహా మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. కానీ ఆయనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు మాత్రం చెప్పలేదు. అంటే పరీక్షా పత్రాలు ముందే లీక్ కావడం వల్ల ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం సానుభూతి చూపడం లేదు. అందుకని వాంగ్ చుక్ ప్రాణాలను కాపాడే ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధంగా లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజూ బేరీజు వేయించి డాక్టర్ల సలహా మేరకు నడుచుకుంటామని మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంటోంది. అంటే వాంగ్ చుక్ ఆమరణ దీక్ష మరి కొన్నాళ్లు కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది. వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకని ఆయనకు అవసరమైన వైద్య సహాయం అందించేట్టు చూడాలని అర్జీ పెట్టుకున్న న్యాయవాది కోరారు. ప్రభుత్వం దీనికి అంగీకరించింది. కానీ ఆయనతో చర్చించి నిరాహార దీక్ష విరమించేట్టు చేస్తామని మాత్రం ప్రభుత్వం చెప్పలేదు. దిల్లీ హైకోర్టు కూడా ఆయన ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేదు. ఇదంతా చూస్తూ ఉంటే వాంగ్ చుక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ప్రభుత్వమూ భావించడం లేదు. దిల్లీ హైకోర్టుకు కూడా అలా అనిపించినట్టు లేదు. ఒక వేళ డాక్టర్లు కనక ఆయనను ఆసుపత్రిలో చేర్పించి బలవంతంగా ఆహారం ఇవ్వాలని సూచించి నప్పుడు ప్రభుత్వం ఆ పని చేయొచ్చునేమో! ఇప్పటికైతే ఆ పని చేస్తామని చెప్పనే లేదు. వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉందని ప్రభుత్వం భావించడం లేదు. కానీ ప్రభుత్వం చేయాల్సిన రాజకీయాలు చేస్తూనే ఉంది. వాంగ్ చుక్ వ్యవహారం ఆసరాగా ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని ఇరుకున పెట్టే సకల ప్రయత్నాలూ చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే కూడా అదే పనిలో ఉన్నట్టున్నారు. రాహుల్ ఇంతవరకు జంతర్ మంతర్ రానందు వల్ల రాహుల్ ది సంకుచిత మనస్తత్వం అనేశారు. ఎలాగైనా సరే రాహుల్ నోరు తెరిచేట్టు చేయాలని బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. నిజానికి కాంగ్రెస్ అధికార ప్రవక్తలు పవన్ ఖేడా లాంటి వారు ఇదివరకే కాక్రోచ్ జనతా పార్టీకి అనుకూలంగా అనేక ప్రకటనలు చేశారు. ప్రభుత్వం ఇతరత్రా పనుల్లో తల మునకలై ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వచ్చే 20వ తేదీనించి ప్రారంభం అవుతున్న పార్లమెంటులో ఆమోదింప చేయడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడానికి అధికార పక్షం ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చి నాలుగు రోజులు దాటింది. కానీ షరా మామూలుగా వాంగ్ చుక్ ఆమరణ దీక్షపై ఆయన నోరే విప్పలేదు. ఈ మెజారిటీ సాధించడంలో సఫలం అయితే వాంగ్ చుక్ చేత నిరాహార దీక్ష విరమింప చేస్తారు. విరమిస్తే వాంగ్ చుక్ ప్రాణాలు నిలుస్తాయి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ మాయం కావొచ్చు. అదీ ప్రభుత్వానికి లాభమే. ఇప్పటికే వాంగ్ చుక్ దీక్ష వల్ల రామమందిరంలో దోపిడీ వ్యవహారం వెనక పట్టు పట్టింది. అదీ కేంద్రానికి అనుకూలమే. ఏమైనా సరే మోదీ లొంగరు అన్న సంకేతం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. 20న పార్లమెంటు మార్చ్కు అనుమతిస్తారో లేదో తెలియదు. 2018 వేసవిలో జి.డి.అగర్వాల్ అనే పర్యావరణవేత్త గంగానది పరిశుద్ధత కాపాడాలని కోరుతూ ఆమరణ దీక్ష చేపట్టారు. గంగా నది పరిశుభ్రతను కాపాడతానని అప్పుడు వారణాసిలో మోదీ ప్రకటించారు. కానీ చేసిందేమీ లేదు. అంతిమంగా దాదాపు వంద రోజుల నిరసన దీక్ష తరవాత అగర్వాల్ 2018 అక్టోబర్ 18న ప్రాణాలు విడిచారు. అగర్వాల్ మంచి నీళ్లు కూడా ముట్టడం మానేసిన తరవాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆయనను ఆసుపత్రిలో చేర్పించింది. వాంగ్ చుక్ విషయంలో మోదీ ప్రభుత్వం ఏ మాత్రం చలించకపోవడానికి ప్రధాన కారణం బీజేపీకి అనుకూలమైన అంశం అందులో ఉంది. వాంగ్ చుక్ వ్యవహారం చర్చలో ఉన్నంత కాలం రామమందిర సొమ్ము దోపిడీ విషయం మరుగున పడిపోతుంది. మోదీ మొదలైన వారికి కావలసింది అదే. వాంగ్ చుక్ ప్రాణాలకన్నా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు, లక్ష్యాలే ఎక్కువ కదా! అందుకే వాంగ్ చుక్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు