Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు

- Advertisement -
  • అండర్ 13, 15, 17, 19 విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు

విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు ఎంపికైనట్లు అకాడమీ ఫౌండర్ కే సాయి సందీప్ తెలిపారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు కృష్ణాజిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పడమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం వేదిక నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. అండర్ 13, 15, 17, 19 విభాగాలలో పలువురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. అండర్ -11 బాలుర సింగిల్స్ విభాగంలో రేయాన్ష్ మొదటి స్థానంలో నిలవగా, లింగం రియాన్ చక్రవర్తి క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయాడు.
అండర్ -11 బాలురు డబుల్స్ విభాగంలో రేయాన్స్, ముఖేష్ జోడి మూడో స్థానంలో నిలవగా, లింగం రియాన్ చక్రవర్తి, పునీతులు క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయారు. అండర్ -11 బాలికల సింగిల్ విభాగంలో లాస్య మూడో స్థానంలో నిలవగా, కందెపు మాన్విత, కందెపు మాన్య శ్రీ , అద్దేపల్లి నాగశ్రీనిక వాటర్ ఫైనల్స్ లో ఓడిపోయారు. అండర్- 11 బాలికల డబుల్ సుభాగంలో లాస్య, దేవి జోడి రెండో స్థానంలో నిలవగా, కందెపు మాన్విత, కందెపు మాన్యశ్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమిపాలయ్యారు. అండర్ 13 బాలుర డబుల్స్ విభాగంలో రేయాన్ష్, వేద్ జోడి రెండో స్థానంలో నిలిచారు. అండర్-15 బాలుర సింగిల్స్ భాగంలో గౌతమ్ రెండో స్థానంలో నిలిచాడు. అండర్ -15 బాలుర డబుల్స్ విభాగంలో గౌతమ్ అండ్ సాత్విక్ జోడి మొదటి స్థానంలో నిలిచారు. అండర్ 15 బాలికల సింగిల్ విభాగంలో శ్రీ తేజ మూడో స్థానంలో సాధించగా, డబుల్స్ విభాగంలో భవిత, శ్రీ తేజ జోడి మొదటి స్థానంలో నిలిచింది. అండర్ -17 బాలుర సింగిల్ విభాగంలో కే మోక్షజ్ఞ, డబుల్స్ విభాగంలో గౌతమ్, అఖిల్ జోడి రెండవ స్థానంలో నిలిచారు. అండర్- 19 బాలికల డబుల్స్ విభాగంలో భవిత, శ్రీ తేజ జోడి మొదటి స్థానంలో నిలిచారు. మహిళల డబుల్స్ విభాగంలో వర్షిత, శ్రావ్య జోడి మొదటి స్థానంలో నిలిచారు. ఎంపికైన క్రీడాకారులు అకాడమీ చీఫ్ కోచ్ వి గంగాధర్ రావు, జూనియర్ కోచ్ కృష్ణ సాయి వద్ద శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అకాడమీ చీఫ్ కోచ్ వి గంగాధర్ రావు, జూనియర్ కోచ్ కృష్ణ సాయి లను అకాడమీ ఫౌండర్ కే సాయి సందీప్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు