అలప్పుజ: సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శిగా వినయ్ విశ్వం మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం అలప్పుజలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. డిసెంబరు 2023లో కణం రాజేంద్రన్ మరణం తర్వాత వినయ్ విశ్వం తొలిసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత వినయ్ విశ్వం మాట్లాడుతూ విమర్శలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.
‘వామపక్ష ఐక్యత చాలా అవసరం. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) బలోపేతం అవుతుంది’ అని ఆయన అన్నారు. ‘అలప్పుజ మహాసభ విజయవంతమయింది. ఈ మహాసభ పార్టీని భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి, వాటిని విజయవంతంగా అధిగమించడానికి సిద్ధం చేస్తుంది. నన్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగాలని రాష్ట్ర మహాసభ ఆదేశించింది. బాధ్యతాయుతమైన పార్టీ కార్యకర్తగా అందుకు నేను అంగీకరించాను’ అని తెలిపారు. కస్టోడియల్ హింస ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ విధానం కాదని సీపీఐ నాయకుడు అన్నారు. దుష్ప్రవర్తనకు పాల్పడిన పోలీసు దళంలోని అధికారులు శిక్ష ఎదుర్కొంటారని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్నికకు ముందు 11 మంది సభ్యులతో రాష్ట్ర కార్యదర్శివర్గం, తొమ్మిది మంది సభ్యులతో కంట్రోల్ కమిషన్ ఎన్నికయింది. సెప్టెంబరు 21 నుంచి 25 వరకు చండీగఢ్‌లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభకు హాజరు కావడానికి మొత్తం 100 మంది ప్రతినిధులు ఎంపికయ్యారు.
సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శిగావినయ్ విశ్వం తిరిగి ఎన్నిక
- Advertisement -
RELATED ARTICLES


